Advertisement
ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ ఐర్లాండ్ కు చెందిన ఓ వైద్యుడు ఇలా రాశాడు ఇది నా జీవితంలోనే అత్యంత బాధకరమైన రోజు….డాక్టర్ గా ఎంతో మందికి పురుడు పోశాను. లేబర్ రూమ్ లో…. ప్రసవించే సమయంలో ఆ తల్లుల బాధను తట్టుకోలేక …ఆ మాతృమూర్తులకు బలాన్నివ్వమని దేవుడిని ప్రార్థించేవాడిని….కానీ ఆ రోజు నా ప్రార్థనలను దేవుడు వినలేదు….. బిడ్డను ప్రసవించే క్రమంలో ఆ తల్లి కళ్లు మూసింది.
Advertisement
ఆ స్త్రీ నేపథ్యం నన్ను మరింత బాధకు గురిచేసింది. ఎందుకంటే పెళ్లైన 14 ఏళ్ల వరకు ఆమెకు పిల్లలు కలగలేదు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కృతిమ గర్భాధారణ ద్వారా ఆ మహిళ గర్భాన్ని ధరించింది…. అప్పటికే ఆమె కడుపులో పెద్ద కణితి ఉంది. బిడ్డ పెరుగుతుంటే….కడుపులో కణితి కరగడం ప్రారంభమైంది. ఆ ఫ్యామిలీ సంతోషానికి అవధులు లేవు…నాకు కూడా!
Advertisements
డెలివరీ సమయం…. ఏడుగంటలు ఆపరేషన్ చేశాం…. ప్రపంచంలోకి అడుగుపెట్టనున్న తన బిడ్డ కోసం ఆ తల్లి ఎంతో ఓపికతో, భరించలేనంత నొప్పిని భరిస్తూ…. ఎదురుచూస్తుంది. ప్రసవం అయ్యింది…బిడ్డను చేతుల్లోకి తీసుకొని నవ్వి,తన బిడ్డను తడుముతూ ఆమె చనిపోయింది. ఈ వార్త విని భర్త మూర్చపోయాడు. 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ రోజు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నాకూ అంతే.
Advertisements