Advertisement
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అందులో వచ్చే విషయాలను నిజంగా నమ్మాలో, నమ్మవద్దో కూడా అర్థం కావడం లేదు. చాలా వరకు విషయాలు జనాలను మోసం చేసేవే ఉంటున్నాయి. ఇక సోషల్ మీడియా వల్ల ప్రస్తుతం ఫేక్ వార్తలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. అయితే వీటిని కాసేపు పక్కన పెడితే నిజానికి ఓ విషయాన్ని మాత్రం ఇప్పటికీ జనాలు నిజమేనని నమ్ముతున్నారు. అదేమిటంటే…
హిమాలయన్ సాల్ట్ తెలుసు కదా. జనాలు ప్రస్తుతం ఈ సాల్ట్‌ను బాగా వాడుతున్నారు. ఆన్ లైన్లోనే కాదు.. మార్కెట్లోనూ మనకు ఈ సాల్ట్ ప్రస్తుతం దొరుకుతోంది. దీన్ని వాడడం వల్ల సాధారణ ఉప్పు కన్నా ఎన్నో రెట్ల లాభాలు కలుగుతాయని ఇంటర్నెట్లో మనకు ఇప్పటికే కోకొల్లలుగా వార్తలు అందుబాటులో ఉన్నాయి. వేటిని చదివినా హిమాలయన్ సాల్ట్ గొప్పదని, ఆహా.. ఓహో.. అద్భుతం.. అని వార్తలు ఉన్నాయి. అయితే నిజానికి అవన్నీ ఫేక్. అవును.. నిజమే. ఎందుకంటే అసలు హిమాలయన్ సాల్ట్ వల్ల నిజానికి మనకు ఎలాంటి లాభాలూ కలగవు.
Advertisement
హిమాలయన్ సాల్ట్ అసలు సాధారణ ఉప్పుతో పోలిస్తే మన ఆరోగ్యానికి హానికరమైందని తేలింది. దీనిపై సైంటిస్టులు పరిశోధనలు చేశారు. ఇందులో మన శరీరానికి హాని చేసే విషపదార్థాలు, రేడియో ధార్మికత కలిగిన మూలకాలు చాలా సూక్ష్మ పరిమాణాల్లో ఉంటాయని గుర్తించారు. అందువల్ల హిమాలయన్ ఉప్పు మనకు ఏ రకంగానూ పనికిరాదని, దాంతో మనకు ఎలాంటి లాభాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగవని, దాన్ని ఉపయోగించడం మానేయాలని సూచిస్తున్నారు.
Advertisements
Advertisements
హిమాలయన్ సాల్ట్‌ను వాడితే అందులో ఉండే విష పదార్థాలు మనకు హాని కలిగిస్తాయని అంటున్నారు. దాన్ని వాడడం మానేయాలని అంటున్నారు. సాధారణ ఉప్పునే వాడాలని సూచిస్తున్నారు. కానీ ఇవేమీ కొందరు తెలుసుకోకుండా అక్కడా ఇక్కడా ప్రచురించారని చెప్పి ఈ ఉప్పును ఎక్కువగా వాడుతున్నారని, దీన్ని వాడకూడదని అంటున్నారు. ఎంతో కాలంగా హిమాయలన్ సాల్ట్‌ను చాలా మంది అమ్ముతున్నారు. కానీ దీని వల్ల అసలు లాభాలేవీ ఉండవని నిర్దారణ అయింది. కనుక మీరు కూడా హిమాలయన్ సాల్ట్‌ను వాడుతుంటే ఒకసారి ఆలోచించండి మరి..!