Advertisement
మహారాష్ట్రకు చెందిన భారత ఆర్మీ బ్రిగేడియర్ ఎంఎల్ ఖేతర్‌పాల్ కుమారుడు లెఫ్టినెంట్ అరుణ్ డిసెంబర్ 16, 1971వ తేదీన పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందాడు. ఇందుకు గాను అతనికి భారత అత్యున్నత మిలిటరీ పురస్కారం పరమవీర చక్ర లభించింది. అయితే వీరి వంశ మూలాలు సర్గోధాలో ఉన్నాయి. వీరి పూర్వీకులు అక్కడి వారే. అయితే ఆ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉంది. ఈ క్రమంలో ఎంఎల్ ఖేతర్‌పాల్‌ను 2001లో అప్పటి పాకిస్థాన్ బ్రిగేడియర్ ఖ్వాజా మహమ్మద్ నసీర్ సర్గోధాకు ఆహ్వానించారు. అక్కడ ఉన్న తమ పూర్వీకుల నివాసాన్ని చూడదలిస్తే రావచ్చని తెలిపారు. దీంతో ఖేతర్‌పాల్ ఆ ఆహ్వానాన్ని అంగీకరించి అక్కడకు వెళ్లారు.
ఈ క్రమంలో ఖేతర్‌పాల్‌ను ఖ్వాజా నసీర్ పర్సనల్‌గా రిసీవ్ చేసుకుని ఆయనను తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఖేతర్‌పాల్‌కు అపూర్వ స్వాగతం లభించింది. నసీర్ కుటుంబ సభ్యులు ఆయన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. తరువాత ఖేతర్‌పాల్ సర్గోధాలో ఉన్న తమ పూర్వీకుల ఇంటిని చూశారు. అనంతరం భారత్‌కు తిరుగు ప్రయణామయ్యారు. ఆ సందర్భంలో నసీర్ ఆయనకు షాకింగ్ విషయం చెప్పారు.
ఖేతర్‌పాల్ కుమారుడు అరుణ్ యుద్ధంలో తన చేతిలోనే చనిపోయాడని, యుద్ధం జరిగినప్పుడు భారత్ వైపు అరుణ్, పాక్ వైపు తాను మాత్రమే మిగిలామని, యుద్ధ ట్యాంకులను పేల్చి వేయడంలో అరుణ్ చూపిన ధైర్య సాహసాలు అమోఘమని, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అతను కాల్పులకు దిగాడని, తాను కూడా కాల్పులు జరిపానని.. కాకపోతే యుద్ధం అన్నాక ఎవరో ఒకరు చనిపోవాలి కదా.. విధి అలా రాసి పెట్టి ఉంది. కనుకనే ఆ రోజు అరుణ్ తన చేతిలో చనిపోయాడని.. నసీర్ తెలిపాడు. ఇక తరువాత ఖేతర్‌పాల్ భారత్‌కు వచ్చాక నసీర్ మళ్లీ ఆయనకు ఓ లేఖ రాశారు. అరుణ్ ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ అందులో అరుణ్‌ను నసీర్ ప్రశంసించాడు.
Advertisement
Advertisements
అయితే కార్గిల్ యుద్ధంలో భారత ఆర్మీ చేతుల్లో చనిపోయిన కర్నల్ షేర్ ఖాన్‌ను భారత ఆర్మీ కొనియాడింది. అతని ధైర్య సాహసాలను భారత్ మెచ్చుకుంది. అతనికి పాకిస్థాన్ అత్యున్నత స్థాయి మిలిటరీ పురస్కారం నిశాన్ ఇ హైదర్ లభించింది. ఇలా సందర్భం ఏదైనా సరే.. భారత్, పాక్ సైనికులు ఒకరినొకరు ఎదుటి వారి ధైర్య సాహసాలను మెచ్చుకుంటారు. అది వారికి మామూలే. ఇరు దేశాల సైనికులూ పోరాడేది తమ దేశం కోసమే. ఆ క్రమంలో వారు తమ దేశానికి వీర జవాన్లలా కనిపిస్తారు. ఎదుటి దేశానికి శత్రువుల్లా కనిపిస్తారు. అలా కనిపించేలా చేసేది ఇరు దేశాల్లోని రాజకీయ నేతలే. వారే ఇరు దేశాల మధ్య యుద్ధాలను సృష్టిస్తారు. అందుకు సైనికులు పోరాటం చేసి తమ ప్రాణాలను కోల్పోతారు. దాంతో వారి కుటుంబాలు ఎంతో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చివరకు ఏదో ఒక దేశం యుద్ధంలో గెలుస్తుంది. ఏది గెలిచినా, ఓడినా.. చివరకు ఇరు వైపులా చనిపోయేది సైనికులే.. నేతలు కాదు..!
Also Read : ఆర్మీలో ఎందుకు చేరాలనుకుంటున్నావ్….? అనే ప్రశ్నకు అతడిచ్చిన సమాధానం.!
Also Read : ఫోటో వెనుక కథనం- పాక్ తో యుద్దం తర్వాత LB శాస్త్రి & మేజర్ సంభాషణ.!
Also Read : ఇండియా- పాకిస్తాన్ వేరు అవ్వడానికి అయన ‘పెన్ గీతలే’ కారణం.!
Advertisements
Also Read : అజిత్ ధోవల్ చేసిన 10 సాహాసాలు.