Advertisement
ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు కొనడం, ఆ బాటిల్ లో నీళ్ళ మీదనే ఆధారపడటం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది. ఒక బాటిల్ కొనుక్కుని దాంట్లో నీళ్ళు తీసుకువెళ్ళే అవకాశం ఉన్నా సరే దారిలో దొరుకుతుంది కదా… 20 రూపాయలకు కక్కుర్తి ఎందుకు అని చాలా మంది అలానే చేస్తున్నారు. అయితే ఆ బాటిల్ లో నీళ్ళు అంత మంచివా…? ప్లాస్టిక్ వస్తువుల్లో వాడే ఏ ఆహార పదార్ధం కూడా మంచిది కాదు.
Read Also:కొండ చిలువ మనిషిని మింగుతుందా…? ఏ వయసు వారిని మింగే ఛాన్స్ ఉంది…?
సరే ఇక వాటర్ బాటిల్ మీద ఎక్స్‌పైరీ డేట్ ఒకటి ఉంటుంది. ఆ డేట్ లోగా అందులో ఉన్న నీళ్ళు తాగితే మంచిది అని ముద్రిస్తూ ఉంటారు. అసలు అలా ఎందుకు ముద్రిస్తారు…? నీళ్ళకు కూడా అలా డేట్స్ ఉంటాయా…? కచ్చితంగా ఉంటుంది. దాదాపు మనం తినే, తాగే ఏ పదార్ధం మీదన అయినా సరే కచ్చితంగా expiry లేక best before date లు అనేవి ఇస్తారు.
Advertisement
Advertisements
మనం నిల్వ ఉంచే పరిస్థితులలో ఏది ఎంత కాలం భౌతికం గా, రసాయనికం గా, మైక్రో బయోలాజికల్ గా భద్రంగా ఉంటుందో ప్రయోగాలు చేసిన తర్వాత ఆ డేట్ వేస్తారు. ఆ బాటిల్ లో ఉన్నవి పైకి నీళ్ల లాగే ఉన్నా సరే లోపల కొన్ని మన కంటికి కనిపించని మార్పులు ఉండే అవకాశం ఉంది. అందుకే అది దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ సీసా లో ఎక్కువ సేపు నీరు నిల్వ ఉండటం మంచిది కాదు కాబట్టే ఎక్స్పైరీ తేదీ వ్రాసేది. ఇక కొందరు ప్రకృతి శాస్త్రవేత్త లు అసలు ప్లాస్టిక్ సీసా లో నీరు నాలుగు గంటలకు మించి ఉంచితే కలుషితం అంటున్నారు.
Advertisements