Advertisement
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి సీజన్‌లోనూ జరిగే ప్రతి మ్యాచ్‌లో స్ట్రాటెజిక్ టైమ్ అవుట్‌ను అమలు చేస్తున్న విషయం విదితమే. ఒక్కో టీం ఇన్నింగ్స్‌కు రెండు సార్ల (బ్యాటింగ్, బౌలింగ్) చొప్పున ఒక్క మ్యాచ్‌లో మొత్తం 4 సార్లు టైమవుట్ తీసుకుంటారు. ఒక్కో టైమవుట్ 2.50 నిమిషాలు ఉంటుంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లలో టైమవుట్ నిబంధన అవసరమా ? దాంతో ఎవరికి ఏం లాభం ఉంటుంది ? అంటే…
ఐపీఎల్ మ్యాచ్‌లలో అమలు చేస్తున్న టైమ్ అవుట్ వల్ల బ్రాడ్‌కాస్టర్లకు భారీగా ఆదాయం వస్తుంది. మరోవైపు టీంలకు వ్యూహాలు రచించుకునేందుకు, కోచ్‌ల సహాయం తీసుకునేందుకు టైం దొరుకుతుంది. ఇలా వారికి లాభం ఉంటుంది. కానీ చూసే ప్రేక్షకులకు మాత్రం ఇర్రిటేషన్ వస్తుంది. నిజానికి టీ20 క్రికెట్ ఉద్భవించిందే చాలా వేగంగా మ్యాచ్ అయిపోతుందని. కానీ దానికి నిర్వచనం మారుస్తూ మరింత టైం పెంచేలా టైమ్ అవుట్ నిబంధనను ఐపీఎల్ యాజమాన్యం చేర్చింది. ప్రపంచంలో ఏ లీగ్‌లోనూ, ఆఖరికి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలోనూ టైమ్ అవుట్ నిబంధన లేదు. కానీ బ్రాడ్ కాస్టర్లకు ఆదాయం రప్పించడం కోసం, మ్యాచ్ లో ఇరు టీంలకు పై విధంగా మేలు చేయడం కోసమే టైమ్ అవుట్‌ను అమలు చేస్తున్నారు.
సాధారణంగా బ్రాడ్ కాస్టర్‌కు ఒక్కో టైమ్ అవుట్ సమయంలో (2.50 నిమిషాలు) యాడ్‌ల వల్ల రూ.3.60 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఒక్క సీజన్‌కు 60 మ్యాచ్‌లు అనుకుంటే ఒక్కో మ్యాచ్‌లో మొత్తం కలిపి టైమ్ అవుట్ 10 నిమిషాలు ఉంటుంది. అంటే 60 మ్యాచ్‌లకు కలిపి టైమ్ అవుట్ 600 నిమిషాలు లేదా 10 గంటలు అవుతుంది. దీన్ని బట్టి లెక్కిస్తే బ్రాడ్‌కాస్టర్లకు టైమ్ అవుట్ వల్ల ఎంతటి ఆదాయం వస్తుందో మనం ఇట్టే తెలుసుకోవచ్చు. అంత ఆదాయన్ని వదులుకోలేకే టైమ్ అవుట్‌ను కంటిన్యూ చేస్తున్నారు. దీని వల్ల ప్రేక్షకులకు చిరాకు తప్ప ఎటువంటి లాభం కలగడం లేదు.
Advertisement
Advertisements
అయితే టైమ్ అవుట్ నిబంధన వల్ల గతంలో ఓ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవాల్సి వచ్చింది. ఫలితంగా వారు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. 2014 ఐపీఎల్‌లో చెన్నై బ్యాట్స్‌మన్ సురేష్ రైనా భీభత్సమైన ఫాంలో ఉన్నాడు. అప్పటికే 25 బంతుల్లో 87 రన్స్ స్కోర్ చేసి విధ్వంసం సృష్టిస్తున్నాడు. అయితే మధ్యలో టైమ్ అవుట్ వచ్చింది. దీంతో టైమ్ అవుట్ అవ్వగానే బ్యాటింగ్ చేపట్టిన రైనా ఔటయ్యాడు. ఆ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది. దీంతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అదే ఆ మ్యాచ్‌లో గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అందువల్ల టైమ్ అవుట్ అనేది కొన్ని సార్లు టీంలకే ఇబ్బంది అవుతుందని మనం గ్రహించవచ్చు.
Advertisements
టైమ్ అవుట్ వల్ల అనవసరంగా మ్యాచ్ ఫ్లో దెబ్బతింటుంది. ఒక రిథమ్‌లో వెళ్లే ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. దీంతో ఇటు టీంలకు కొన్ని సార్లు నష్టం కలుగుతుంది. మరోవైపు అటు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. కానీ బ్రాడ్‌కాస్టర్లకు ఆదాయం వస్తుంది. అయితే టైమ్ అవుట్ లేకపోయినా ఆదాయం పరంగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఓవర్ ఓవర్‌కు, వికెట్ పడినప్పుడు, ఆటగాళ్లకు గాయాలు అయినప్పుడు ఏర్పడే అంతరాయం సమయంలో.. బ్రాడ్ కాస్టర్లు యాడ్స్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. అలాంటప్పుడు టైమ్ అవుట్ ద్వారా డబ్బులు సంపాదించకపోయినా కలిగే నష్టం ఏమీ పెద్దగా ఉండదు. అయినప్పటికీ డబ్బు డబ్బే కదా. అందుకని టైమ్ అవుట్‌ను అమలు చేస్తున్నారు. నిజానికి అసలు దాన్ని అమలు చేయాల్సిన పనేలేదు..!