Advertisement
ఏంటీ.. షాకయ్యారా..? ఎక్కడైనా మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు కానీ.. కుక్కలు ఆత్మహత్య చేసుకుంటాయా..? అని అనుకుంటున్నారా.. అవును.. మీ డౌట్ కరెక్టే. అయినా.. మేం చెబుతున్నది మాత్రం నిజం. అక్కడ నిజంగానే కుక్కలు ఆత్మహత్య చేసుకుంటాయి. వినేందుకు చాలా షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడుందంటే..?
స్కాట్‌లాండ్‌లోని డంబర్టన్ సమీపంలో 1895లో నిర్మించబడిన పురాతన బ్రిడ్జి ఒకటుంది. దాన్ని ఓవర్‌టౌన్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. అక్కడ ఇప్పటి వరకు 600కు పైగా కుక్కలు బ్రిడ్జి మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాయి. ఇది నిజంగా జరిగింది. ఆ బ్రిడ్జి 50 అడుగుల లోతు ఉంటుంది. అయితే కుక్కలు ఆ బ్రిడ్జి వద్దకు రాగానే అందులోకి ఎందుకు దూకుతున్నాయో.. ఎందుకు చనిపోతున్నాయో.. ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే మిగిలిపోయింది. దానికి ఎవరూ సరైన కారణాలను కనిపెట్టలేకపోతున్నారు.
అయితే స్థానికులు చెబుతున్న ప్రకారం.. పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ బ్రిడ్జి వద్ద దెయ్యాలు ఉంటాయని.. అందుకనే వాటిని చూసిన కుక్కలు వాటిపై దాడి చేసేందుకు కిందకు దూకుతాయని స్థానికులు చెబుతారు. ఇక 1994 అక్టోబర్‌లో 33 ఏళ్ల ఓ వ్యక్తి తన పసికందు అయిన కుమారున్ని ఆ బ్రిడ్జి నుంచి కిందకు విసిరేశాడట. దీంతో ఆ పసికందు దెయ్యమయ్యాడట. ఈ క్రమంలో ఆ దెయ్యాన్ని చూసిన కుక్కలు కిందకు దూకి చనిపోవడం మొదలు పెట్టాయట.
Advertisement
Advertisements
Advertisements
ఇక మింక్ అని పిలవబడే ఓ జాతికి చెందిన జీవి వాసనను పసిగట్టే కుక్కలు వాటిని వెదికే క్రమంలో అకస్మాత్తుగా ఆ బ్రిడ్జి నుంచి కిందకు దూకుతున్నాయట. అందుకే కుక్కలు అక్కడ కిందకు దూకి చనిపోతున్నాయని కూడా చెబుతారు. అయితే మింక్ అనే జీవులు అసలు అక్కడ గత 50 ఏళ్ల నుంచి కనిపించడం లేదని, కనుక కుక్కలు బ్రిడ్జి నుంచి కిందకు దూకేందుకు మింక్ జీవులు కారణం కాదని కొందరు అంటున్నారు.
అయితే ఆ బ్రిడ్జికి కేవలం ఒకే వైపు నుంచే కుక్కలు కిందకు దూకుతుండడం మరొక మిస్టరీ. రెండో వైపు నుంచి కుక్కలు కిందకు దూకడం లేదు. ఇక వాతావరణం క్లియర్‌గా ఉన్నప్పుడే.. అంటే.. సూర్యుడు ఉన్నప్పుడే కుక్కలు కిందకు దూకుతున్నాయి. మబ్బులు పట్టిన వాతావరణంలో బ్రిడ్జి నుంచి దూకడం లేదు. అలాగే కుక్కలు మొదటి సారి దూకినప్పుడు చనిపోవు. అవి మళ్లీ పైకి వచ్చి మళ్లీ కిందకు దూకి చనిపోతున్నాయి. దీంతో కుక్కలు ఆత్మహత్య చేసుకుంటున్న ఆ బ్రిడ్జి మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు అలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని ఇప్పటికీ ఎవరూ తేల్చలేకపోయారు. ఏది ఏమైనా.. అత్యంత షాకింగ్‌గా.. భయంగొల్పే విధంగా ఆ బ్రిడ్జి ఉంది కదా..!