Advertisement
90’s లో హైద్రాబాద్ లో ఎక్కువగా డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవి. నిర్వాహణ కష్టతరమౌతుందని భావించి 2005 నుండి డబుల్ డెక్కర్ బస్సులను నిలిపివేశారు. తాజాగా ఓ నెటిజన్ కేటీఆర్ ను హైద్రాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించాల్సిందా కోరగా….దానిపై స్పందించిన కేటీఆర్ ఈ విషయంపై ఆలోచించాలని రవాణాశాఖ మంత్రిని కోరారు. దీంతో హైద్రాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దానితో పాటు ఆ బస్సుతో తమకున్న అనుభవాలు కూడా పంచుకుంటున్నారు నెటీజన్లు.
డబుల్ డెక్కర్ బస్ తో ….. ఓ నెటీజన్ జ్ఞాపకం:
అది 1997.అప్పుడు నేను సెవెన్త్ క్లాస్.
అప్పట్లో .. మా ఊళ్లో సెవన్త్ వరకే ఉండేది.
కాబట్టి తర్వాతి సంవత్సరం నుంచి వేరే ఊరికి వెళ్లిపోతామని ప్రతీ సంవత్సరం సెవెన్త్ బ్యాచ్‌ను జూపార్క్ తీసుకెళ్తుండేవాళ్లు మా టీచర్లు.
అప్పుడు మా వంతు వచ్చిందన్నమాట.
ఇగో అప్పుడే పాస్ తీస్కొని డబుల్ డెక్కర్ బస్ ఎక్కినం.
బస్సు నెంబర్ 7 జెడ్. జూపార్క్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది.
డబుల్ డెక్కర్ బస్సుల కూసుంటే సంబురం లెక్క అనిపించింది.
ఆనందంతో పైకెక్కినోళ్లం కిందికి.. కిందికెక్కినోళ్లం పైకి ఎక్కుతూ.. దిగుతూ మస్తు ఎంజాయ్ చేసినం దోస్తులం.
జూపార్క్ చూసినంక ట్యాంక్ బండ్ వచ్చేటప్పుడు కూడా మల్లా డబుల్ డెక్కర్ బస్సే ఎక్కించిండ్రు మా సార్లు.
ఆ మెమరీస్ చాలా కాలమే నెమరేసుకున్నాము.Advertisement
డబుల్ డెక్కర్ బస్సులను తొలగించడానికి కారణాలేంటి?
1) నిర్వాహణ
కింద ఓ కండక్టర్, పైన ఓ కండక్టర్ ఉండేవాళ్లు….దీంతో అదనపు సిబ్బంది అవసరమయ్యేవారు ., దానికి తోడు లీటర్ డీజిల్ 2 కిలోమీటర్ల మైలేజ్ యే ఇచ్చేది. బస్సులు కూడా పాతవి అవ్వడంతో నిర్వాహణ ఖర్చులు ఎక్కువగా ఉండేవి.
Advertisements
2) ట్రాఫిక్ – రోడ్లు
నగరంలో జనాభా పెరుగుతున్న కొద్దీ ట్రాఫిక్ పెరగడంతో డబుల్ డెక్కర్లు నడపడం కష్టతరమయ్యేది..దీనికి తోడు రోడ్డు కూడా బాగాలేక పోవడం, మూలు మలుపుల వద్ద డబుల్ డెక్కర్లు కంట్రోల్ తప్పడం జరిగేవి.
3) స్పేర్ పార్ట్స్
ఈ డబుల్ డెక్కర్లను అశోక్ లేల్యాండ్ కంపెనీ తయారు చేసుది. 1990 నుండి ఈ కంపెనీ ఈ బస్సుల తయారీ నిలిపేసింది, దీనికి తోడు స్పేర్ పార్ట్స్ ను కూడా క్రమంలో ఉత్పత్తి చేయడం ఆపేసింది. దీంతో బస్ రిపేర్ కు వస్తే మూలకు పడేది.
4) బస్సుల ఎత్తు
అప్పుడప్పుడే ల్యాండ్ లైన్ ఫోన్ ల కనెక్షన్స్ స్టార్ట్ అయ్యాయి దీనికి తోడు విద్యుత్ లైన్లు కూడా పెంచారు. అక్కడక్కడా ఈ వైర్లు ఆ డబుల్ డెక్కర్ బస్సులను తగిలేవి.
1978 లో సుల్తాన్ బజార్ రోడ్డు పై ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్!
Advertisements