Advertisement
“వదల బొమ్మాలి…నిన్నొదల..” అనే డైలాగ్ ని పశుపతి వాయిస్లో పవర్ఫుల్ గా కాకుండా.. నేనొప్పుకోను నేనొప్పుకోను..అనే కొండవలసగారి వాయిస్లో ఊహించుకోండి..అబ్బో బాగలేదు కదా.. వినగానే మత్తుగా అనిపించే వాయిస్ ఏం మాయ చేశావేలో జెస్సిది.. నిజానికి అరుందతిలో పశుపతికి అయినా..ఏం మాయ చేశావేలో సమంతా క్యారెక్టర్ కి అయిన ప్లస్ ఆ వాయిస్.. మరి ఆ వాయిస్లతో మెస్మరైజ్ చేసింది మాత్రం తెరపై కనిపించే సోనూసూద్, సమంతలు కాదు..
ఆ మాటకొస్తే మన తెలుగు సినిమా నిండ పరభాషా నటులే..వాళ్లెవరికి తెలుగు రాదు.. మరెట్లా.. అలాంటివారందరికి తమ గాత్రాన్నందించి ఆ పాత్రలకి మరింత పేరు తెస్తున్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్లు.. 24 ఫ్రేమ్స్ లో ఒకరైన డబ్బింగ్ ఆఱ్టిస్ట్ లేనిదే సినిమా లేదు..అలాంటి కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్ట్ ల గురించి చెప్పుకుందాం..
సరిత:
కమలహాసన్ సరసన మరోచరిత్ర సినిమాలో నటించి వెండితెరకు పరిచయం అయిన సరిత..తర్వాత కొద్ది కాలంలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారింది..మొదట్లో హీరోయిన్ అవ్వడానికి వచ్చి ఈ మాటలు మాట్లాడడం ఏవిటి అనుకుని వెనక్కి తగ్గినప్పటికి నాటి నుండి నేటివరకు ఎందరో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది నటి సరిత.. తను డబ్బింగ్ చెప్పిన వారిలో సౌందర్య, విజయశాంతి,నగ్మ ఇలా ఎందరో హీరోయిన్స్ ఉన్నారు..సినిమా ఒప్పుకునేముందే డబ్బింగ్ సరిత చెప్తుంది కదా అని కన్ఫామ్ చేసుకునేవారట సదరు హీరోయిన్లు…
Advertisements
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం:
కమల హాసన్ కి ఎక్కువగా తన గాత్రాన్ని అరువిస్తుంటారు SP బాలసుబ్రహ్మణ్యం.. దశావతరంలో పది పాత్రల్లో ఏడు పాత్రలకి డబ్బింగ్ బాలుగారే చెప్పారు..అన్నమయ్య చిత్రానికి గాను బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డందుకున్నారు.
మనో:
రజినికాంత్ కి తెలుగు సినిమాలకు గాత్రధానం చేసేది సింగర్ మనో..రజిని పంచ్ డైలాగ్ లను మనో తప్ప మరొక డబ్బింగ్ ఆర్టిస్ట్ పట్టుకోలేరు..అప్పుడప్పుడు కమల్ కి కూడా డబ్బింగ్ చెప్తుంటారు.
ఎస్పీ శైలజ:
సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరుపొందారు సింగర్ ఎస్పి శైలజ..ఈవిడ వాయిస్ ని మనం చాలా ఈజీగా గుర్తుపట్టేయొచ్చు..కొంచెం కీచుగా…చాలా స్పష్టంగా ఉండడం ఈ వాయిస్ ప్రత్యేకత.. నిన్నే పెళ్లాడతా లో టబుకి, మురారిలో సోనాలికి డబ్బింగ్ చెప్పింది శైలజ . సంఘవి, శ్రీదేవి ఇలా ఎందరో నటీమనులకు గాత్రదానం చేసింది.
సాయికుమార్:
డబ్బింగ్ ఆర్టిస్ట్ ల గురించి చెప్పుకోవాలంటే సాయి కుమార్ గారి పేరు లేకుండా అది పూర్తవదు..నటుడిగా అందరికి సుపరిచితుడైన సాయికుమార్ వాయిస్ కూడా మనకు చాలా పరిచయమే… ఈయన ఎక్కువగా రాజశేఖర్ మరియు సుమన్ లకి డబ్బింగ్ చెప్తుంటారు.. సాయి కుమార్ డైలాగ్ డెలివరీ, స్పష్టత, ఆ వాయిస్ లో బేస్ ఇవన్ని లక్షణాలు సాయికుమార్ వాయిస్ కి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి..
రవిశంకర్:
Advertisement
నటుడు సాయికుమార్ కి స్వయానా తమ్ముడే రవిశంకర్. అన్నదమ్ములిద్దరూ నటనతో పాటు డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా తమ సత్తా చాటారు. ఇప్పటికి 4000కి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. వందల సంఖ్యలో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. నాజర్, ప్రకాశ్ రాజ్, సోనూ సూద్ ఇలా ఎందరో నటులకి డబ్బింగ్ చెప్పారు. అరుందతి సినిమాలో పశుపతి పాత్రకి రవిశంకర్ చెప్పిన డబ్బింగ్ రవిశంకర్ కి చాలా పేరు తీసుకొచ్చింది.
సునీత:
పాటలతో పాటు సునీత మాటలతో కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది సునీత. త్రిష, కమలిని ముఖర్జీ, సదా, మీరాజాస్మిన్ ఇలా ఎందరో హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9 నంది అవార్డులను తన ఖాతాలో వేసుకుంది..
హేమచంద్ర:
సింగర్ గా పరిచయం ఉన్న హేమచంద్ర డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అని చాలా కొద్ది మందికి తెలుసు. ఇటీవల సింగింగ్ తో నటులకి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ధృవ సినిమాలో స్టైలిష్ విలన్ అరవింద్ స్వామికి డబ్బింగ్ చెప్పింది హేమచంద్రే… తమిళ అప్ కమింగ్ హీరోల సినిమాలు తెలుగులో వస్తే వాటిల్లో హీరో పాత్రలకు డబ్బింగ్ చెప్తుంటాడు.
చిన్మయి శ్రీపాద:
తన పాటలతోనే కాదు, మాటలతో కూడా మాయ చేసింది చిన్మయ్.. సమంతా నటించిన సినిమాల్లో చాలా ఎక్కువ వాటికి డబ్బింగ్ చెప్పింది చిన్మయే…ఏం మాయ చేశావేలో సమంతా పాత్రకి అంత పేరొచ్చిందంటే అందులో 50% క్రెడిట్ చిన్మయ్ వాయిస్ కి కూడా ఉంటుంది.
రోజారమణి:
చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయి..నటిగా మారి..తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్థిరపడిన నటి రోజారమణి. ఈవిడ డబ్బింగ్ చెప్పిన హీరోయిన్ల లిస్ట్ చాలా పెద్దది..నాటి రాధ,రాధిక,సుహాసిని,భానుప్రియ మొదలుకొని.. యమున,రోజా,రంభ వాళ్ల కాలంలోని హీరోయిన్లందరికి డబ్బింగ్ చెప్పారు రోజారమణి..శిల్పాశెట్టి,అంజలాజవేరి,ట్వింకిల్ కన్నా లాంటి బాలివుడ్ భామల వరకు మొత్తానికి 50మందికి పైగా హీరోయిన్లకు తన గాత్రం అరువిచ్చారు రోజారమణి..నటుడు తరుణ్ రోజారమణి గారి కొడుకే..
సవిత రెడ్డి:
త్రిష, జెనిలియా, ఆర్తి , భూమిక ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ల కాలంలో వచ్చిన చాలా మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ సవితనే . బొమ్మరిల్లు లో హాసిని, ఖుషిలో మధు రెండు పాత్రలకి సవిత చెప్పిన డబ్బింగ్ తో ఎక్కడ లేని పేరు సంపాదించింది…అంతేనా ఇంకేం కావాలి… వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ.. బొమ్మరిల్లులో సవిత చెపపిన ఈ డైలాగ్ చాలామంది రింగ్ టోన్ గా మారింది.
Advertisements
వీళ్లే కాదు సీరియల్ నటుడు రఘుకుంచె, యాంకర్ /యాక్ట్రెస్ కలర్స్ స్వాతి, సింగర్ శ్రావణి భార్గవి లాంటి వారు తమ గాత్రాన్ని నటులకు అరువిచ్చారు..మనకి తెరపై నటుల నటన నచ్చుతుంది అంటే అందులో డబ్బింగ్ ఆర్టిస్ట్ ల వాయిస్ మహత్యం కూడా ఉంది.. మనకి ఆ పాత్రలు నచ్చేలా చేస్తున్న గొంతులు వీరివే…