Advertisement
కరోనా వచ్చిన తర్వాత చాలా మంది డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు మనకు రోగ నిరోధక శక్తిని విపరీతంగా పెంచుతాయని వైద్యులు చెప్పడంతో బాదం పప్పు, జీడి పప్పు, ఖర్జూర వంటి వాటిని తెచ్చుకుని తింటున్నాం. తింటే తిన్నారు గాని బాదం పప్పు ఎందుకు నానబెట్టాలో చెప్తా తెలుసుకోండి.
చాలా మంది బాదంపప్పు 5–6 గింజలు రోజూ రాత్రి నానబెట్టి ఉదయం వాటిని తింటూ ఉంటారు. ఏళ్ళ తరబడి తినే వాళ్ళు కూడా ఉన్నారు. అలా నానబెట్టిన పప్పులు తినడం వలన… తొక్క తేలికగా వచ్చేస్తుంది. ప్రొటీన్లు పదిలంగా ఉండి మనం నమలడానికి చాలా సులువుగా ఉంటాయి. 6 గంటలు పైబడి నానబెడితే తొక్క స్పీడ్ గా వస్తుంది.
Advertisement

అది ఏ వయసు వారికి అయినా సరే నమలడం చాలా సులువుగా ఉంటుంది. ఆ విధంగా తింటే రక్తంలో కొలెస్ట్రాల్, బిపి, డయాబెటిస్ వంటివి కంట్రోల్ ఉంటాయి. మన శరీరానికి కావలసిన పోషకాలు అన్నీ అందులో దొరికేస్తాయి. ఇక కిడ్నీలో రాళ్ళు అనే మాట ఉండదు. జీర్ణ ప్రక్రియలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఆరు గింజలు చాలు… కాదని ఎక్కువ తింటే డయేరియా వస్తుంది.
Advertisements
Also Read: అసలు బాక్సాఫీస్ అంటే ఏంటీ…? హౌస్ ఫుల్ అనే పదం కరెక్టేనా…? ఇదే ఆ చరిత్ర…!
Advertisements