Advertisement
ప్రకటనల్లో కనిపించే ధరలు ఎక్స్ షోరూం ధరలు….వాటిని చూసి అంతకే వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు అనుకుంటే పొరపాటే….ఎక్స్ షో రూం ధరపై కనీసం 10 శాతం అధనంగా కలిపి ఆన్ రోడ్ ధర ఉంటుంది!
- ఎక్స్ షోరూం ధర:
వాహనాన్ని డీలర్లు కస్టమర్లకు అమ్మే బేసిక్ రేట్ ను ఎక్స్ షోరూం రేట్ అంటారు. ఇందులోనే డీలర్ల లాభాలు, ట్రాన్స్పోటేషన్ ఖర్చులు, దిగుమతి చేసుకున్న రాష్ట్రాలకు కట్టే ఆక్ట్రోయ్ పన్నులు కలిపి ఉంటాయి. ఇది ఒక్కో సిటీకి ఒక్కోలా ఉంటుంది
- ఆన్ రోడ్ ధర: వాహనం ఫైనల్ రేట్ ను ఆన్ రోడ్ రేట్ అంటారు. దీనిలో రిజిస్ట్రేషన్ చార్జీలు, లైఫ్ టైమ్ రోడ్ టాక్స్ ,ఖచ్చితమైన ఇన్సురెన్సులు కలిపి ఉంటాయి. కొంత మంది డీలర్లు అధనపు యాక్సెసరీస్ , అధిక వారెంటీ పేరుతో మరింత రేటును పెంచే ప్రయత్నం చేస్తారు…యాక్సెసరీస్, అధనపు వారెంటీలు మీకు అవసరమైతేనే తీసుకోండి
కొత్త వాహనం కొనేటప్పుడు ఏం ఏం ఛార్జీలు ఉంటాయి.!
Advertisement
రిజిస్ట్రేషన్ ఛార్జ్:
RTO ఆఫీస్ లో వాహనం మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రేట్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. తెలంగాణ లో…. టూ వీలర్ మీద 9శాతం, ఫోర్ వీలర్ మీద 12%( 10 లక్షల లోపు) 14% ( 10 లక్షల పైన )గా ఉంది. ( ఇది ఆన్ రోడ్ ధరలోనే కలిసి ఉంటుంది)
లైఫ్ టైమ్ రోడ్ టాక్స్ :
10-15 సంవత్సరాల రోడ్ టాక్స్ కోసం…లైఫ్ టైమ్ రోడ్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇది కూడా రాష్ట్రాన్ని బట్టి మారుతుంటుంది. టూ వీలర్ కు ఓ రేట్, 4 వీలర్ కు మరో రేట్ ఉంటుంది. ఎక్స్ షోరూం ధరపై 3 నుండి 20 శాతం వరకు ఈ టాక్స్ ఉంటుంది. (ఇది ఆన్ రోడ్ ధరలోనే కలిసి ఉంటుంది)
Advertisements
ఇన్సూరెన్స్:
ఇది బండి సామర్థ్యాన్ని, ఎక్స్ షోరూం ధర ను బట్టి నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఇన్సురెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది
Advertisements
హ్యాండ్లింగ్ ఛార్జీలు :
మనం ఆర్డర్ ప్రకారం….వాహనాన్ని కంపెనీ నుండి గోదాముకు, అక్కడి నుండి షోరూం తీసుకొచ్చి మనకు అందిస్తారు. దానిపై హ్యాండ్లింగ్ ఛార్జీలు అంటూ కొంత అమౌంట్ ను యాడ్ చేస్తారు…అయితే సుప్రీం కోర్ట్ ఈ చార్జీలు చట్టవిరుద్దమని తీర్పునిచ్చింది..ఎందుకంటే ఎక్స్ షోరూం ధరలోనే డీలర్ల లాభాలు కలిపి ఉంటాయని మళ్లీ అధనంగా కస్టమర్ల నుండి డబ్బులు తీసుకోకూడదని పేర్కొంది!