Advertisement
“తన తండ్రి ఎక్కడైతే సైకిల్ తొక్కి కష్టపడి తనని చదివించాడో..అదే ప్రాంతంలో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తూ తండ్రిని తలెత్తుకునేలా చేసింది ఓ కూతురు” అంటూ సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరలవుతోంది.. ఫోటోలో ఉన్న వ్యక్తి నిజమే,తను ఎస్ఐ అనే మాట కూడా నిజమే..మరి నిజం కానిది ఏంటి అంటే…నెట్టింట్లో వైరలవుతున్నట్టు తన తండ్రి రిక్షావాడు కాదు ..ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు?
ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ప్రియాంక నేగి..హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ లో SI గా విధులు నిర్వహిస్తోంది.. ఇంటర్నేషనల్ కబడ్డి ప్లేయర్. హిమాచల్ ప్రదేళ్ మహిళల కబడ్డి జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తుంది..2018లో ఆసియా క్రీడలలో రజతపతకం సాధించిన జట్టులో కూడా ప్రియాంక ఉంది.. హిమాచల్ ప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా అందించే పరశురామ్ అవార్డు గ్రహీత..కబడ్డి ప్లేయర్ గా ఎన్నోసార్లు వార్తల్లో వ్యక్తిగా నిలిచింది..ఆ వార్తల్లో ఎక్కడా కూడా ప్రియాంక తండ్రి ఒక సాధారణ రిక్షా నడుపుకునే వ్యక్తి,తనది అత్యంత పేద కుటుంబం అని పేర్కొనలేదు..మరి ఈ ఫోటో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది.
Advertisement
ప్రియాంక నేగి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది..ఎప్పటికప్పుడు తన ఫోటోస్ ని, అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. రెండు నెలల క్రితం ప్రియాంక తన ఎఫ్బీ అకౌంట్లో పెట్టిన ఫోటోలను “ఐఏఎస్ తైయారి” అనే ఎఫ్బీ ఫేజ్ కాపీ చేసి.. ఈ కథ అల్లి పోస్ట్ చేసింది.. శేర్ చేసిన గంటలో వెయ్యికి పైగా లైకులు, శేర్లు.. సోషల్ మీడియాలో తన ఫోటోతో వైరలవుతున్న కథ ప్రియాంక వరకు చేరింది..
సోషల్ మీడియలో వైరలవుతున్న వార్తల్లో నిజం లేదని తనది హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ , నేను పనిచేస్తున్న ప్లేస్ కి 200కిమి దూరం ఉంటుంది..పోస్టులో ఉన్నట్టుగా మా నాన్న రిక్షావాడు కాదు,మాకంటూ కొన్ని ఆస్తులు ఉన్నాయి. అలాంటి స్టోరీలు రాయొద్దు అంటూ ప్రియాంక స్వయంగా చెప్పింది..అప్పటికే వేల సంఖ్యలో శేర్ అయిన న్యూస్ ప్రియాంక మాటలు వినేలా లేరు.. కనీసం ఇకపై మీ వరకు ఆ న్యూస్ వస్తే గుడ్డిగా ఫార్వర్డ్ చేయకుండా ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టండి.
Advertisements
Advertisements