Advertisement
అఘోరా లు అంటే సమాజంలో చాలా వరకు భయం ఉంది. వాళ్ళు బ్రతికే విధానాలు, వాళ్ళు పాటించే పద్దతులు, తినే ఆహారం ఇలా ఎన్నో మనల్ని భయపెడుతూ ఉంటాయి. అఘోరాలకు సంబంధించి అఖండ సినిమా తర్వాత కాస్త చర్చ జరుగుతుంది. అసలు వాళ్ళు ఏ ఆహారం తింటారు, అంత చలిని ఎలా తట్టుకుంటారు…? హిమాలయాల్లో కూడా ఊపిరి ఎలా అందుతుంది అనే దానికి సంబంధించి సోషల్ మీడియాలో కొందరు చర్చిస్తున్నారు. అఘోరాలు ప్రధానంగా రెండు సంప్రదాయాలకి చెందిన వారు ఉంటారు.
Advertisement
భైరవుడిని ఆరాధించేవారు
దత్త సంప్రదాయం వారు
Advertisements
నాలుక రుచులు కోరుకోకూడదు అని ఏదైనా తిని బ్రతకడం అలవాటు చేసుకోవడం లో భాగంగానే వారు శవం మాంసం తినడం అలవాటు చేసుకోవడం గమనార్హం. కాని రోజు అది తినరు. కళ్ళు మంచి దృశ్యం చూడాలన్న తపనని, చెవులు పొగడ్తలు వినాలన్న కాంక్షని, చర్మం, ముక్కు చక్కని స్పర్శ, పరిమళం కోరుకోవడాన్ని నియంత్రించి ఇంద్రియ నిగ్రహం చేయాలనే ప్రయత్నం లో భాగంగా సమాజానికి మింగుడు పడని మార్గంలో వారు బ్రతుకుతారు.
Advertisements