Advertisement
రైలు గురించి మనం తెలుసుకోవడానికి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. రైలు పట్టాల దగ్గర నుంచి భోగీ వరకు, రైలు ఇంజిన్ నుంచి లోపల తిరిగే ఫ్యాన్ ల వరకు అన్నీ ఆసక్తికరమే. ఇక రైలు భోగీకి ఉండే కడ్డీలు నిలువగా ఎందుకు ఉండవు, అడ్డంగా ఎందుకు ఉంటాయి అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.
Also Read:క్రికెటర్లకు ఫీల్డింగ్ టైం లో దెబ్బలు తగలకుండా ఏం చేస్తారు…? పేస్ బౌలర్లు అక్కడ ఎందుకు నిలబడరు…?
అందుకు ప్రధానమైన కారణం ఒక్కటే సౌలభ్యత. నిలువు కడ్డీలు ఉండే ఇంటి కటాంజనం(గ్రిల్) లో నుంచి ఏదైనా వస్తువు తీసుకోవడానికి,ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. అదే అడ్డంగా ఉండే పద్దతిలో అయితే సులువుగా ఉంటుంది. రైళ్ళలో తినుబండారాలు,కాఫీ కప్పులు ఇలాంటివి అడ్డం కడ్డీ లలో చాకచక్యంగా సరఫరా చేస్తూ ఉంటారు. అలా వస్తువులు బయట నుంచి ఇవ్వడానికి సులువుగా ఉంటుంది.
Advertisement
Advertisements
జైలు కడ్డీలు మాదిరిగా నిలువగా ఉంటే చూడటానికి కూడా చిరాకుగా ఉంటుంది. జైలులో ఉన్న అనుభూతి కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇంటి ఫెన్సింగ్, పక్షి పంజరం, జంతువులను ఉంచే డబ్బాలు అన్నీ కూడా నిలువు కడ్డీలతో ఉంటాయి. ఇక ఎమర్జెన్సీ సమయంలో కూడా అడ్డంగా ఉన్న కిటికీలను వంచడం కూడా చాలా సులువుగా ఉంటుంది. అందుకే అలా ప్లాన్ చేసారు అన్నట్టు. అయితే ముందు తరం రైళ్ళలో అలా ఉండేది కాదు గాని తర్వాత తర్వాత ఆ విధానం మారింది.
Advertisements
Also Read:క్రికెట్ లో ఎవరికి తెలియని రూల్, లక్ష్మణ్ ను కాపాడిన గంగూలి…!