Advertisement
తెలుపు మీద నలుపు పోరాటం నిన్నా మొన్నటిది కాదు..అమెరికాలో బ్లాక్ లివ్స్ మాటర్ పోరాటం ఈ మధ్యకాలంలో మరింత ఉదృతం దాల్చింది..ఈ పోరాటానికి అనేకమంది సామాన్యులు, సెలబ్రిటిలు తమవంతు మద్దతు ప్రకటిస్తుండగా.. రేసిజాన్ని ప్రోత్సహించే వాటిల్లో ఫెయిర్ నెస్ క్రీమ్ ల పాత్ర కూడా ఉందని.. స్కిన్ కలర్ ని ప్రమోట్ చేస్తూ వస్తున్న ప్రొడక్ట్స్ పైన కూడా ఈ పోరాటం జరుగుతోంది.. ఇన్నేళ్ల పోరాటం తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీలో “ఫెయిర్” ని తొలగిస్తున్నట్టుగా యూనిలివర్ ప్రకటించింది.. అంతకంటే ముందుగానే ఈ ప్రొడక్ట్ పై తన వంతు యుద్దాన్ని ప్రకటించింది 22ఏళ్ల చందన హిరన్..
ఫెయిర్ అండ్ లవ్లీ కి , మనిషి చర్మ రంగుకి ప్రాధాన్యతనిచ్చే విషయాలకు వ్యతిరేకంగా “ఆల్ శేడ్స్ ఆర్ లవ్లీ” అంటూ change.org లో ఒక పిటిషన్ దాఖలు చేసింది చందన.. గంటల వ్యవధిలోనే దీనిపై వేల సంఖ్యలో సంతకాలు నమోదయ్యాయి..స్కిన్ కలర్ ని ప్రమోట్ చేస్తూ, కేవలం ఫెయిర్ గా ఉండే వాళ్లు, ఫెయిర్ మాత్రమే లవ్లీ అన్నట్టుగా ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ పై యుద్దానికి దిగింది..
Advertisement
I have goosebumps as I read this! Kudos to you .@Unilever I'm so so so happy rn. And I thank you on behalf of over 10k people who signed my petition for this to happen – https://t.co/EW7RjBTk6r #Unreal #ThankYou #AllShadesAreLovely
.@HUL_News pic.twitter.com/yhec0DJ2Hz— Chandana Hiran (@chandana_hiran) June 25, 2020
Advertisements
Advertisements
కేవలం చందన హిరణ్ పోరాటం వలనే యూనిలివర్ పేరు మారుస్తుంది అని చెప్పలేం కానీ.. ఆ బ్రాండ్ ని, ఆ తరహా మెంటాలిటిని వ్యతిరేఖించిన కొన్ని వేల మందిలో చందన ఒకరు..యునిలివర్ ప్రకటణతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, తనకు తోడుగా వచ్చిన కొన్ని వేలమందికి ఈ సంధర్బంగా థాంక్యూ చెప్పింది..ఇకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ కొత్త పేరు ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
ఐశ్వర్యరాయ్ ప్రపంచ సుందరిగా ఎన్నికయిన సంవత్సరంలో మన దేశంలో కాస్మెటిక్స్ వ్యాపారం అమాంతంగా పెరిగిపోయింది..ఎన్ని క్రీములు వాడిన మనిషి తన సహజ రంగుని మార్చుకోలేడన్నది అందరికి తెలిసిన విషయమే..అయినప్పటికి కొందరు సెలబ్రిటిలు వీటిని ప్రోత్సహిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తుంటే..సాయిపల్లవి, సుశాంత్ లాంటి వాళ్లు ప్రజలను మోసం చేయలేమని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.