Advertisement
తెలుగు సినిమాలో కొందరు నటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రధానంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుకా కీలక పాత్రలు పోషించే వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా తెలుగు సినిమా మరువలేని కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. ఇక తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అంటే ఆ అయిదుగురు ఎక్కువగా గుర్తు వస్తారు. ఈ తరానికి వాళ్ళ గురించి పెద్దగా తెలియదు. వారు ఎవరో ఒకసారి చూస్తే…
Also Read:ఈ తరం ప్రేక్షకులకు తెలియని ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు…!
ఎస్వీ రంగారావు: అతని గురించి ఈనాటి తరం యువత కూడా కొంత తెలుసుకోవాలి. ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన సినిమాలు ఈ తరంలో ఎవరూ చేయలేదు. ఎలాంటి పాత్రను అయినా సరే చాలా సమర్ధవంతంగా పోషించే వారు. తెలుగు సినిమాలో ఆయన నటన ఒక గ్రంథాలయమని చెప్తూ ఉంటారు ఇప్పటికీ.
Advertisements
కైకాల సత్యనారాయణ: ఈయన మొదట్లో విలన్ గానూ, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ, తర్వాత హాస్య నటుడిగా తనదైన ముద్ర వేసుకుని ఎన్నో పాత్రలు చేసారు. మూడు తరాల హీరోలను ఆయన కవర్ చేసారు. అయితే పద్మ అవార్డు మాత్రం ఆయనకు రాలేదు.
Advertisement
నిర్మలమ్మ: ఈమె చేసిన పాత్రలు మహిళా నటులు ఎవరూ చేసి ఉండరు ఏమో. మూడు తరాల హీరోలను కవర్ చేసి ఎన్నో అందమైన పాత్రలు చేసారు. విలన్ గా కూడా ఆమె నటించడం ఆ సినిమా సూపర్ హిట్ కావడం జరిగాయి.
రావు గోపాల రావు: తెలుగు సినిమా ప్రస్తావన వస్తే ఈ పేరు కచ్చితంగా వినపడుతుంది. విలన్ అయినా, తండ్రి అయినా, తాత అయినా, మామ అయినా సరే ఈయన చేయని పాత్ర లేదు. దాదాపు అందరు హీరోలకు ఈయన బాగా దగ్గర అనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోయే వారు.
అల్లు రామ లింగయ్య: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటే ఈయనను చాలా మంది కమెడియన్ గా చూసే వారు. కాని ఆయన కూడా చాలా మంచి పాత్రలు చేసారు. దాదాపు అందరు హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు ఆయన.
Advertisements
Also Read:గూగుల్ అసిస్టెన్స్ తో ఏం ఏం చేయవచ్చు…?