Advertisement
ఇండస్ట్రీలో ఛాన్స్ దొరకడం చాలా కష్టం..కానీ ఒకరికి ఒక్క అవకాశం దొరికితే చాలు వారి వెనుకే కుటుంబం సభ్యులు రావడం షరా మామూలే..కానీ కుటుంబ సభ్యులు కలిసి నటించిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా అంటే వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.. ఆ సినిమాలేంటో.. ఆ బంధువులెవరో ఒక లుక్కేయండి..
రామారావు-బాలక్రిష్ణ:
నందమూరి తారకరామారావు, బాలక్రిష్ణ కలిసి అనేక సినిమాల్లో నటించారు..వాటిల్లో కొన్ని సలీం అనార్కలి, అన్నదమ్ముల అనుబంధం,బ్రహ్మర్శీ విశ్వామిత్ర,సింహం నవ్వింది,శ్రీమద్విరాట పర్వం.
అక్కినేని కుటుంబం
Advertisements
అక్కినేని ఫ్యామిలి ప్యాక్ లా ఉంటుంది మనం మూవీ..నాగేశ్వర్రావు, నాగార్జున,నాగచైతన్య,సమంత క్లైమాక్స్లో అఖిల్..అందరూ నటించిన మూవీ మనం.. నాగేశ్వర్రావు చివరి చిత్రం కూడా ఇదే.. నాగేశ్వర్రావు,నాగార్జున కాంబినేషన్లో ఇద్దరూ ఇద్దరే,కలెక్టర్ గారబ్బాయి..తదితర చిత్రాల్లో కలిసి నటించారు.
నాగార్జున-అఖిల్
నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ ప్రధాన పాత్రగా ఏడాది వయసులో యాక్ట్ చేసిన సినిమా సిసింద్రీ.. ఈ సినిమాలో నాగార్జున,అఖిల్ కలిసి నటించారు..తర్వాత మనం మూవీలో అఖిల్ రెండు నిమిషాల నిడివి ఉన్న ప్రత్యేక పాత్ర పోషించారు..
వెంకటేశ్- నాగచైతన్య
మామాఅల్లుడు వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం వెంకీమామ..
మంచు ఫ్యామిలి
మంచు ఫ్యామిలి మెంబర్స్ మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ముగ్గురు కలిసి నటించిన చిత్రం పాండవులు పాండవులు తుమ్మెదా.
Advertisement
నాగార్జున -సుమంత్
నాగార్జున, మేనల్లుడు సుమంత్ కలిసి నటించిన మూవీ స్నేహమంటే ఇదేరా..ఇందులో వీరిద్దరూ ప్రాణస్నేహితుల పాత్రల్లో నటించారు..వీరి సరసన భూమిక, ప్రత్యూష నటించారు.
క్రిష్ణ-మహేశ్ బాబు- గౌతమ్
అడపాదడపా మహేశ్ మూవీల్లో అతిది పాత్రల్లో దర్శనం ఇస్తూనే ఉంటారు క్రిష్ణ..రాజకుమారుడు, వంశీ ఇవి కొన్ని.. ఇకపోతే వన్ నేనొక్కడినే సినిమాలో మహేశ్ చిన్నప్పటి పాత్రను పోషించింది మహేశ్ తనయుడు గౌతమే..
క్రిష్ణంరాజు -ప్రభాస్
రెబల్ స్టార్ క్రిష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రభాస్..వీరిద్దరూ కలిసి నటించిన మూవీ రెబల్.
రవితేజ-మహాధన్
మాస్ మహరాజా రవితేజ, తనయుడు మహదన్ నటించిన సినిమా రాజా దిగ్రేట్..ఈ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో మహాధన్ నటించాడు..
రాంచరణ్-అల్లు అర్జున్
రాంచరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ నటించిన చిత్రం ఎవడు..ఇకపోతే రాంచరణ్ మగధీర మూవీలో బంగారు కోడిపెట్ట పాటలో చిరు, చిరూ సినిమా ఖైదీ నెం-150లో అమ్మడూ పాటలో రాంచరణ్ అతిధిపాత్రల్లో మెరిసారు.
Advertisements
మొత్తంగా చూసుకుంటే అక్కినేని ఫ్యామిలి అందులోనూ నాగార్జున తన కుటుంబ సభ్యులందరితో కలిసి నటించారు…ఇది మాకు తెలిసిన కొన్ని సినిమాల లిస్టు..మీకు తెలిసిన సినిమా పేర్లను కామెంట్ చేయండి.