Advertisement
మాదో అందమైన పల్లెటూరు…మిడిల్ క్లాస్ ఫ్యామిలి.! అక్కకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు నాన్న.! పెళ్లి ఏర్పాట్లు, కట్న కానుకలు , ఖర్చులు, డబ్బులు…ఈ లెక్కల్లో బిజీబిజీగా ఉన్నారు నాన్నగారు! మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు పడే కష్టం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాను ఆ సందర్భంలో….!
మొదట పెళ్లి…ఇంట్లోనే చేద్దామనుకున్నారు. కానీ పెళ్లికొడుకు వాళ్ల తరఫు వాళ్ల డిమాండ్ కారణంగా పెళ్లి ఫంక్షన్ హాల్ కు షిప్ట్ అయ్యింది! నాన్న లెక్క తప్పింది…. రెండు లక్షల వరకు ఎక్ట్సా ఖర్చు పెరిగింది…ఆ టైమ్ చాలా హైరానా పడిపోయారు.! తనకు ఫ్రెండ్ దగ్గర రెండు రూపాయల వడ్డీకి ఆ డబ్బు తెచ్చారు!
Advertisement
పెళ్లి రోజు రానే వచ్చింది…. అమ్మనాన్న రెండు రోజులుగా సరిగ్గా నిద్రపోలేదు! ఎప్పుడూ పెళ్లి గురించిన చర్చలే సాగుతుండేవి వారిద్దరి మద్య.! ముహుర్తం దగ్గరకొచ్చేసింది…అక్క మెడలో బావ తాళి కట్టేశాడు…అతిథులందరూ అక్షితలు వేసి ….భోజనాలకు వెళ్ళారు.! వారు 200 మంది వస్తారనుకొని ఫుడ్ ఏర్పాట్లు చేశారు…కానీ వాళ్లు 350 మంది దాకా వచ్చారు…భోజనాలు సరిపోలేదు.! తర్వాతి వాళ్లకు ఫుడ్ తక్కువ పడింది…పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అలిగారు….. నాన్న మీద కోప పడ్డారు.! ఆ టైమ్ లో నాన్న కంట్లో కన్నీరు చూశాను.! అప్పు చేసి తన స్థాయికి మించి మరీ ఇంతలా ప్రయాస పడిన నాన్నకు చివరకు మిగిలింది అవమానం.!
Advertisements
భరించలేనంత కోపం వచ్చింది…కానీ ఏమీ చేయలేని స్థితిలో నేను….నాకు అర్థంకాక అడుగుతాను పెళ్లికి అయినోడిని, కానోడిని పిలవాల్సిన అవసరముందా? అసలే ఖర్చులతో సతమతమయ్యే అమ్మాయి తరఫు వాళ్లకు మరింత భారం అవ్వాల్సిన అవసరముందా? 50 మందితో పెళ్లి కాదా? పెళ్లి పేరుతో భోజనాలు..అందులో అరవై వెరైటీలు…ఏం నిరూపించుకోవాలని?
Advertisements