Advertisement
పని చేయడం కోసం గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లే భారతీయులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కి చెందిన నీలా ఎల్లయ్య అనే వ్యక్తి యూఏఈకి నిర్మాణ కూలీగా వెళ్ళాడు.అతను యూఏఈకి చేరుకోగానే అతని పాస్ పోర్ట్ ను సదరు సంస్థ వాళ్ళు తమ ఆధీనంలో పెట్టుకున్నారు.అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆ సంస్థను నీలా ఎల్లయ్య వదిలేసి అక్కడ 16 ఏళ్ళ నుండి వివిధరకాల ఉద్యోగాలు చేస్తున్నాడు.పాస్ పోర్ట్ లేని అతని పరిస్థితి గురించి తెలుసుకున్న రూపేష్ మెహతా అనే జేయిన్ సేవా మిషన్ సభ్యుడు అతనికి టెంపరరీ పాస్ పోర్ట్ అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పాత పాస్ పోర్ట్ లేకపోవడంతో ఈ వ్యవహారం ఆలస్యమైంది.
Advertisement
ఈలోపు అక్కడి అధికారులు ఈ తతంగాన్ని గుర్తించారు.16 ఏళ్ళ నుండి తమ దేశంలో పాస్ పోర్ట్ లేకుండా నివసిస్తున్నందుకు నీలా ఎల్లయ్యకు 29 లక్షల రూపాయలు ఫైన్ వేశారు.ఎల్లయ్య భార్య అభ్యర్ధన మేర హైదరాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ వారు అతని పాతపాస్ పోర్ట్ వివరాలను దుబాయ్ లో ఉన్న భారత్ కాన్సులేట్ వారికి షేర్ చేశారు.దీనితో అతనికి టెంపరరీ పాస్ పోర్ట్ తో పాటు దుబాయ్ నుండి హైదరాబాద్ కి వెళ్ళడానికి ఫ్రీ టికెట్ అందించారు.భారత్ కాన్సులేట్ వారు అందించిన సమాచారంతో దుబాయ్ ప్రభుత్వం అతనిపై విధించిన పెనాల్టీని రద్దు చేసింది.
Advertisements
దానితో ఎల్లయ్య సోమవారం హైదరాబాద్ కు చేరాడు.పనికోసం ఎల్లయ్య దుబాయ్ వెళ్లేసరికి చిన్న పాపగా ఉన్న అతని కూతురు ఇప్పుడు తల్లిగా మారింది. పదహారేళ్ల నుండి కుటుంబానికి దూరంగా ఉంటున్న ఎల్లయ్య ను ఆయన భార్యను అధికారులు క్వారంటైన్ లో ఉంచారు.
Advertisements