Advertisement
అమ్మ ప్రేమకు… మాతృత్వానికి గాఢమైన నిదర్శనంగా తల్లి తన చిన్నారికి చనుబాలివ్వడాన్ని చెప్పొచ్చు… ఎక్కడున్నా…ఏ వేళలో అయినా… ప్రకృతి సహజంగా… ఇన్ స్టంట్ గా తన పాపాయి బొజ్జ నింపడానికి బ్రెస్ట్ ఫీడింగ్ ను మించిన మంచి మార్గం మరొకటి లేదు..కానీ, బహిరంగ ప్రదేశాల్లో పాలు ఇవ్వడానికి తల్లులు ఇబ్బంది పడుతుంటారు..బహిరంగంగగా పాలివ్వడాన్ని తప్పుడు దృష్టితో చూసే విధానం పోవాలని గతంలో ఎందరో దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు..
మళయాళం మ్యాగజైన్ “గృహలక్ష్మి” కవర్ పేజ్ పై బిడ్డకు పాలిస్తున్న ఫోటోని పబ్లిష్ చేసారు.. ఆ ఫోటోలో మోడల్ గిలు జోసెఫ్ తల్లి స్థానంలో ఉంది.. ఆ ఫోటోని వ్యతిరేకిస్తూ ఆ మ్యాగజిన్ పై, గిలు జోసెఫ్ పై కేసు పెట్టారు..మరికొందరు దాన్ని ఆమోదించారు.. ఆస్ట్రేలియన్ పార్లమెంటేరియన్ లారిస్సా పార్లమెంట్లో బిడ్డకు పాలివ్వడం చర్చనీయాంశం అయింది..ప్రపంచవ్యాప్తంగా కథలు కథలుగా చెప్పుకున్నారు.. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తల్లులు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.. ఈ ఇష్యూపై రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి..
Advertisement
ఇక్కడ మరికొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాలి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఫ్యామిలితో సినిమాకు కానీ,కాసేపు సేదతీరడానికి పార్క్ కి వెళ్లేపరిస్థితి లేదు.. ప్రేమికులకు రొమాన్స్ చేసుకోవడానికి వాటిని మించిన బెస్ట్ ప్లేస్ లేవు..పబ్లిక్ లో రొమాన్స్ ఒకె..
Advertisements
పబ్లిక్ లో మందు తాగడం ఒకె..సిగరెట్ తాగడం ఒకె…ఆఖరికి పబ్లిక్ లో ఉచ్చపోయడం కూడా ఒకె..కానీ తల్లి తన బిడ్డ ఆకలి తీర్చడానికి మాత్రం నాట్ ఒకె..
Advertisements
సృష్టిలో అమ్మ ప్రేమను మించినది లేదు.. అమ్మను మించి దైవమున్నదా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాం..పొగడ్తల్లో ముంచెత్తుతుంటాం.. కానీ అమ్మతనాన్ని మాత్రం గౌరవించడానికి వెనకాడతాం.. అమ్మతనాన్ని కూడా కామపు చూపులతో వేధిస్తుంటాం..నలుగురిలో ఆ పనేంటి అన్నట్టుగా మాటలతో వేధిస్తుంటాం..పబ్లిక్ లో పైవన్ని పనులు చేయడానికి ఒకె అయినప్పుడు పాలిచ్చే తల్లులు మాత్రం ఎందుకు వెనకడుగు వేయాలి ? ఒకసారి ఆలోచించండి.