Advertisement
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్….. మొదట్లో బాలీవుడ్ వరకే పరిమితమైన ఈ అవార్డ్స్ తర్వాత సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పేరుతో తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళంలో కూడా ఇవ్వడం స్టార్ట్ చేసారు. 1972 నుండి బెస్ట్ యాక్టర్ క్యాటగిరిని ప్రవేశపెట్టిన ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ ని ఇంతవరకు మన తెలుగు వారు ఎంతమంది అందుకున్నారు? ఏ ఏ సినిమాలకు ఆ అవార్డ్స్ లభించాయి? ఎక్కువసార్లు ఆ అవార్డ్ అందుకుంది ఎవరు ? … అసలు ఈ అవార్డ్స్ దక్కని సూపర్ స్టార్స్ ఎందరు? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మొట్టమొదటి సారి 1972 లో బడి పంతులు సినిమాకు NTR ఈ అవార్డ్ పొందగా . చివరగా 2018 లో రంగస్థలం మూవీకి రాంచరణ్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్ దక్కించుకున్నాడు .
7 సార్లు అవార్డ్ పొందిన హీరో & సినిమాలు:
అత్యధిక సార్లు ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్ దక్కించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. చిరు 7 సార్లు ఈ అవార్డ్ పొందాడు. శుభలేఖ, విజేత , ఆపద్భాంధవుడు , ముఠా మేస్త్రి , స్నేహంకోసం , ఇంద్ర , శంకర్ దాదా MBBS సినిమాలకు గాను 7 ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు గెలుచుకున్నాడు.
Advertisements
5 సార్లు అవార్డ్ పొందిన హీరో & సినిమాలు:
తర్వాత 5 సార్లు ఈ అవార్డ్ అందుకొని రెండవ స్థానంలో నిలిచాడు మహేష్ బాబు . ఒక్కడు , పోకిరి , దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు , శ్రీమంతుడు సినిమాలకు గాను 5 ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు గెలుచుకున్నాడు.
4 సార్లు అవార్డ్ పొందిన హీరోలు & సినిమాలు:
శోభన్ బాబు ,విక్టరీ వెంకటేష్ చెరో నాలుగుసార్లు ఈ అవార్డ్ అందుకున్నారు . కార్తీక దీపం , సోగ్గాడు , జీవనజ్యోతి , ఖైదీ బాబాయ్ సినిమాలకు శోభన్ బాబు . బ్రహ్మపుత్రుడు , ధర్మచక్రం , గణేష్ , జయం మనదేరా సినిమాలకి వెంకటేష్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ పొందారు .
Advertisement
3 సార్లు అవార్డ్ పొందిన హీరోలు & సినిమాలు:
నాగేశ్వరరావు , కృష్ణంరాజు , కమల్ హాసన్ , అల్లు అర్జున్ మూడు సార్లు ఈ అవార్డ్స్ పొందారు . మరుపురాని మనిషి , ఆత్మబంధువులు , సీతారామయ్య గారి మనవరాలు సినిమాలకు ఏఎన్ఆర్ . అమర దీపం , తాండ్ర paparayudu , బొబ్బిలి బ్రాహ్మన్న సినిమాలకు కృష్ణంరాజు .
ఆకలి రాజ్యం , సాగరసంగమం , ఇంద్రుడు చంద్రుడు సినిమాలకు కమల్ హాసన్ . పరుగు , వేదం ,రేసుగుర్రం సినిమాలకు అల్లు అర్జున్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ అందుకున్నారు.
2 సార్లు అవార్డ్ పొందిన హీరోలు & సినిమాలు:
అన్న , మగాడు , సినిమాలకు రాజశేఖర్ . యమదొంగ , నాన్నకు ప్రేమతో సినిమాలకు ఎన్టీఆర్ . మగధీర , రంగస్థలం కు రాంచరణ్ లు రెండేసి సార్లు ఈ అవార్డ్స్ అందుకున్నారు .
ఓకే ఒక్క సారి అవార్డ్ పొందిన హీరోలు & సినిమాలు:
Advertisements
బడి పంతులు సినిమాకి ఎన్టీఆర్ . అన్నమయ్య మూవీకి నాగార్జున . పెదరాయుడు సినిమాకి మోహన్ బాబు .. పదహారేళ్ళ వయసుకి చంద్రమోహన్ … శంకరాభరణం సినిమాకి సోమయాజులు … గబ్బర్ సింగ్ కి పవన్ కళ్యాణ్ .. నువ్వు నేను మూవీకి ఉదయ్ కిరణ్ .. నువ్వొస్తానంటే నేనోదంటాన సినిమాకి సిధార్ధ .. అర్జున్ రెడ్డి మూవీ కి విజయ్ దేవరకొండ … ఒక్కోసారి ఈ అవార్డ్స్ సాధించారు .