Advertisement
” అమ్మానాన్న నన్ను క్షమించండి…. నేను రంజిత్ ను లవ్ చేసినందుకు వాడు నన్ను హ్యాపీగా ఉండనివ్వడం లేదమ్మా…. లవ్ చేసినవ్ గా చేసుకుంటే నన్నే చేసుకోవాలి లేదంటే చచ్చిపో…అంటున్నాడు.! వాడిని పెళ్లి చేసుకొని మీకు చెడ్డపేరు తేలేను ….అలా అని మీరు చెప్పిన సంబంధం చేసుకున్నా …వాడు నన్ను హ్యాపీగా ఉండనివ్వడు…. బతికి ఉండి మీకు బాధను ఇవ్వడం తప్ప నా నుండి మీకు జరిగే మంచి ఏమీలేదు గుడ్ బై ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్” అంటూ…. జగిత్యాల జిల్లాకు చెందిన ఉమ అనే 19 ఏళ్ళ యువతి నోట్ రాసి పురుగుల మందు తాగి చనిపోయింది.
Advertisement
ఇంటర్ లో ఉండగా…ఉమ రంజిత్ అనే అబ్బాయిని ప్రేమించింది. ఇంటర్ తర్వాత చదువు మానేసిన ఉమ…. రంజిత్ తో తన ప్రేమ విషయాన్ని ఇంట్లో ధైర్యంగా చెప్పింది. అప్పటికే ముగ్గురు కూతుర్ల పెళ్లిళ్లు చేసిన ఉమ తల్లిదండ్రులు నాల్గో అమ్మాయైన ఉమకు ఆమె ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి చేయాలని నిశ్చయించారు.!
రంజిత్ … రెండేళ్లుగా పెళ్లి చేసుకుంటానంటూ దాటవేస్తూ వచ్చాడు. అతని ధోరణితో విసుగెత్తిన ఉమ తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అలా వచ్చిన ప్రతి సంబంధాన్ని రంజిత్ చెడగొడుతూ….నన్ను ప్రేమించావ్…నన్నే చేసుకోవాలని ఉమను వేధించినట్టు తెలుస్తుంది.!
దీంతో మనస్థాపానికి గురైన ఉమ లెటర్ రాసి …పురుగుల మందు తాగి బలవనర్మరణానికి పాల్పడింది. ఉమ కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు రంజిత్ పై కేసు నమోదైంది!
Advertisements
Advertisements