Advertisement
నిన్న లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా..ఇంటి సభ్యులు టమోటా జ్యూస్ తీస్తున్న సమయంలో ఎండ్ అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ ఈరోజు అక్కడి నుండే ప్రారంభమైంది.ఇక బిగ్ బాస్ ఇచ్చిన 30 బాటిల్స్ ఆర్డర్ ను ఎవరు పూర్తి చేయకపోవడంతో ఇవ్వవలసిన పాయింట్స్ లో బిగ్ బాస్ భారీగా కోత విధించారు 14,000 పాయింట్స్ కు గానూ 2000 పాయింట్స్ ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేశారు.
ఇక అల్లు అర్జున్ నటించిన జులాయి చిత్రం లోని పకడో పకడో వేకప్ సాంగ్ తో నిద్రలేచిన బిగ్ బాస్ హౌస్ మెట్స్ గంగవ్వ వర్కౌట్స్ చూసి, 62 ఏళ్ళ వయసులో ఆమె అంత చురుగ్గా ఉండటం చూసి షాక్ అయ్యారు.ఇక కిచెన్ లో శుభ్రంగా ఉండాలనే అంశంపై మొనాల్ గజ్జర్ మరియు రాజశేఖర్ మాస్టర్ మధ్య వివాదం చెలరేగింది. కాని అది ఎవరూ ఆపకుండా కొద్దిసేపటికే కూల్ అయిపోయింది.
పాపం ఎగ్స్ తినని మోనాల్ ఆ ఎగ్స్ ను ఎక్కడపడితే అక్కడ పెట్టొద్దని తెలుగులో చెప్పడానికి కళ్యాణి సహాయం తీసుకున్నారు.ఇక కొద్దిసేపటికే లాస్య, మొనాల్‌లు వంట చేస్తున్న టైంలో కరాటే కళ్యాణి తనకి ఫుడ్ వద్దని తను ఈరోజు ఉపవాసం ఉంటానని చెబుతూ బయటకు వచ్చేసింది.ఇది చూసి మనం వంట చేస్తున్నందుకు ఆమె ఇలా అంటున్నారా అని లాస్య, మొనాల్ ఆలోచనలో పడ్డారు.ఇక బయటికి వచ్చిన కరాటే కళ్యాణి అఖిల్ దగ్గరకు వెళ్లి తనకు ఆర్డర్లు వేసిన కండిషన్స్ పెట్టిన నచ్చదని తెగ ఫీల్ అయిపోయారు.
Advertisement
కొద్దిసేపటికి బిగ్ బాస్ కిచెన్ లో అమ్మా రాజశేఖర్ మాస్టర్ నిన్న అందరూ కంటెస్టెంట్ ల తో ఓపెన్ అయిన దివితో పులిహార కలుపుతూ అడ్డంగా ఇంటి సభ్యులకు దొరికిపోయారు.ఇక అమ్మా రాజశేఖర్ దివితో ఎంతలా పులిహార కలిపారంటే కప్ లో వేయాల్సిన టీపొడిని బాండలిలో వేసే అంత కలిపారు.ఇక ఈ విషయాన్ని అమ్మా రాజశేఖర్ మాస్టర్ స్వయంగా ఇంటి సభ్యులతో పంచుకున్నారు.
ఇక ఆతరువాత ఇంటి సభ్యులలో కొందరి పై నోయల్ ర్యాప్ సాంగ్ పాడి అలరిస్తే.దేవి,మెహబూబ్,దివి నోయల్ పై ఓ ర్యాప్ సాంగ్ పాడి అతన్ని సర్ప్రైజ్ చేశారు. ఆతరువాత ఇంటి సభ్యులు కట్టప్ప ఎవరో తామే తేల్చుకోవాలని బిగ్ బాస్ డిసైడ్ చేశారు.అలాగే ఇంటి సభ్యులు కట్టప్ప అయ్యి ఉంటారని భావిస్తున్న వాళ్ల ముఖంపై స్టాంప్ కొట్టాలని బిగ్ బాస్ నిబంధన పెట్టారు.అందరూ వారు కట్టప్ప అనుకుంటున్న వారి పై స్టాంప్ వేసి వారిని కట్టప్ప అని ఎందుకు అనుకుంటున్నారో కారణం చెప్పారు. ఈ ప్రక్రియలో నోయల్ తనని తాను స్టాంప్ చేసుకున్నారు దీన్ని బిగ్ బాస్ అంగీకరించలేదు దానితో నోయల్ తనకు ఎక్కువగా చనువు ఉన్న రాజశేఖర్ మాస్టర్ పై స్టాంప్ కొట్టారు.
Advertisements
ఈ ప్రక్రియ పూర్తవ్వగానే బిగ్ బాస్ కట్టప్ప గురించి ఇప్పుడే చెప్పమని ఇంకొంత టైం పడుతుందని చెప్పి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చారు.ఇంటిలో ఏర్పడుతున్న గ్రూప్స్ ఎలా మాట్లాడుకుంటాయి వాళ్ళు ఎలా వ్యవహరిస్తారనే అంశంపై అమ్మా రాజశేఖర్ తనదైన శైలిలో యాక్ట్ చేసి చూపించి అందరినీ నవ్వించారు.
Advertisements
ఇక రేపటి ఎపిసోడ్ లో వారం తరువాత నాగార్జున ఇంటి సభ్యులను కలవడానికి వస్తున్నారు.మరి ఆ ఎపిసోడ్ లో జరగనున్న విషయాల గురించి రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.