Advertisement
పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఎప్పుడూ ఏదో ఒక చారిత్రక నిర్మాణమో, శిలాజాలో, వస్తువులో బయట పడుతుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం భయం గొల్పుతుంటాయి. చాలా వరకు తవ్వకాల్లో పురాతన కాలం నాటి అస్థిపంజరాలు బయట పడుతుంటాయి. వాటిని చూస్తే భయం వేస్తుంది. అలాంటి కొన్ని తవ్వకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్రీస్తు శకం 1200 నుంచి 1400 సంవత్సరాల మధ్య ఉత్తర ఇటలీలోని నెక్రోపోలిస్ అనే ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా వాటిల్లో ఓ అస్థిపంజరం బయట పడింది. అందులో చేతికి కత్తి ఉంది. అంటే అప్పట్లో ఆ వ్యక్తి చేతిని తొలగించగా అతను దాని స్థానంలో కత్తిని ఏర్పాటు చేసుకున్నట్లు మనకు అర్థమవుతుంది.
క్రీస్తు శకం 79వ సంవత్సరంలో పాంపెయిలోని మ్యాట్ వెసువియస్ అనే ప్రాంతంలో బండరాయిలో చిక్కుకుపోయిన అస్థిపంజరాన్ని గుర్తించారు. అతను అక్కడి నుంచి తప్పించుకుంటుండగా ఆ రాయి అతని మీద పడి అతను నలిగి పోయి ఉంటాడని సైంటిస్టులు నిర్దారించారు.
Advertisements
Advertisement
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వద్ద పురావస్తు తవ్వకాల్లో 6 చోట్ల గుంతల్లో మహిళల పుర్రెలు బయట పడ్డాయి. అప్పట్లో మహిళలను షిమావో అనే వర్గానికి చెందిన వారు బలిచ్చేవారట.
పోలండ్‌లో 1600-1700 మధ్య కాలానికి చెందిన అస్థిపంజరాలను అక్కడి డ్రాక్సో అనే శ్మశానవాటికలో తవ్వకాల్లో గుర్తించారు. అప్పట్లో మనుషుల రక్తాన్ని తాగే వాంపైర్లు (రక్త పిశాచులు) ఉన్నాయనే కారణంతో జనాలు కొందరు చనిపోయిన వారిని భిన్న రూపంలో సమాధి చేసేవారు. వారు సమాధి నుంచి మళ్లీ లేచి రక్తం తాగుతారనే ఉద్దేశంతో వారు లేవకుండా ఉండేందుకు గాను వారి మెడను ఓ ప్రత్యేకమైన పరికరంతో బిగించి కట్టేవారు. లేదా వారి నోళ్లలో రాళ్లను బలంగా గుచ్చి పూడ్చేవారు. ఆ అస్థిపంజరాలు తవ్వకాల్లో 2014లో బయట పడ్డాయి.
అప్పట్లో గిరోలామో సెగాటో అనే ఓ వైద్య నిపుణుడు చనిపోయిన వారి శరీరాలు కుళ్లిపోకుండా ఉండేందుకు గాను వారి శరీరాలకు పలు రసాయనాలను పూసి భద్రపరిచేవాడు. ఆ శవాలను చూస్తే అవి బొమ్మల్లా కనిపించేవి. దంతాలు ముందుకు వచ్చి అవి భయాన్ని గొలిపే విధంగా ఉండేవి.
Advertisements