Advertisement
మనం రోజూ రకరకాల ఫూడ్ తింటూ ఉంటాం..ప్రూట్స్,వెజిటిటేబుల్స్,చాక్లెట్స్ ఇలా ..మన దగ్గర డబ్బులుంటే నిమిషాల్లో అవి మన చేతుల్లో ఉంటాయి..వావ్ యమ్మీ అనుకుంటూ లాగించేస్తాం.. కానీ మనం తినే పండ్లను ఎలా పండిస్తారు?? చాక్లెట్స్ తయారు చేయడానికి చెట్లకి సంబంధం ఏంటి ?? ప్రకృతి మనకు ఇచ్చిన బహుమానాల్లో ఒకటైన ఆహారానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
చాక్లెట్స్ :
“చాక్లెట్స్” పేరు వింటుంటేనే నోరూరుతుంది కదా.. ఛాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు అంటే కొకో పౌడర్ తో అని టక్కున చెప్తారు..కానీ కకోవా పౌడర్ మనకి దొరికేది చెట్ల నుండి…కోకో చెట్టు నుండి లభించే కోకో పాడ్స్ లోపలి గింజలనుండి కోకో పౌడర్ ని తీస్తారు. ఆ పొడితో చాక్లెట్స్ తయారు చేస్తారు.. అంటే ఫైనల్ గా మనం తినే చాక్లెట్స్ మనకి దొరికేది ప్రకృతి నుండి అన్నమాట.
కుంకుమ పువ్వు:
Advertisements
“కుంకుమ పువ్వు” పేరులో పువ్వు ఉంది కాబట్టి..మీకు సగం ఆన్సర్ దొరికినట్టే..కానీ “కుంకుమ పువ్వు”నే మనం వాడే కుంకుమ పువ్వు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే..మనం కుంకుమపువ్వుగా వాడేది ఆ పువ్వు మద్యలో ఉండే అండకోశాల్ని .. పువ్వు మధ్యలో పొడుగ్గా కాడల్లా మూడే అండకోశాలు ఉంటాయి..కిందభాగంలో పసుపు, పైన ఎరుపురంగులో ఉండే ఈ అండకోశాలనే కుంకుమపువ్వుగా పిలుస్తారు. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశభాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చుకున్న పూలను కొయ్యడంలో ఒక్కపూట ఆలస్యం అయినా వాడిపోతాయి, రంగునీ రుచినీ కోల్పోతాయి.అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వు ఒకటి.
దాల్చిన చెక్క :
బిర్యానిలో చిన్న ముక్క చెక్క పడితే అబ్బో ఆ రుచే వేరు.. దాల్చిన చెక్క చెట్ల బెరడుని తీసి ఎండబెడతారు..అదే మనం దాల్చినచెక్కగా వాడతాము..సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్కది ప్రత్యేక స్థానం.
“పైనాపిల్”
పైనాపిల్ పైనంతా ముల్లుల్లా ఉన్నా, లోపల పండు నోట్లో పెట్టుకోగానే నోరంతా జ్యూస్ తో నిండిపోతుంది.. ఫైనాపిల్ చెట్లు కూడా ముల్ల మాదిరిగా ఉంటాయి..భూమిలోనుండి పొడుచుకొచ్చినట్టుగా ఉండే ముల్లు వంటి మొక్కలకి మధ్యలో పైనాపిల్ పెరుగుతుంది.
Advertisement
పిస్తా
చూడడానికి పల్లిలు(వేరుశెనగ)ల్లా ఉండే పిస్తా పల్లిల మాదిరి భూమిలో పెరగదు.. చెట్లకు గుత్తులుగుత్తులుగా పెరుగుతాయి..పిస్తా పప్పులు మంచి ఉత్పత్తి రావాలంటే సుమారు 7-10సంవత్సరాల కాలం పడుతుంది..ఇలా పండించిన పిస్తా పప్పులను ఎండబెట్టి ప్రాసెసింగ్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు..
కేపర్స్ (మరాటి మొగ్గ)
ఒక రకమైన కేపర్ మొక్కకి చెందిన కపోక్ మొగ్గల్నే మనం మరాటి మొగ్గగా వాడుతున్నాం..ఆకుపచ్చ రంగులో ఉన్న మొగ్గల్ని ఎండబెడితే మనకి మార్కెట్లో లభ్యమయ్యే మరాటి మొగ్గలుగా మారతాయి.
బాదం
బాదం చెట్టు మీరు చూసే ఉంటారు..బాదం కాయల్ని పగలకొట్టి లోపల పప్పు తినడం లాంటివి చేస్తుంటారు..కాని ఆ బాదం కాయ బాదం చెట్టుకి పూచిన పువ్వ, కాయగా మారుతుంది.
కివి పండ్లు
కివి పండ్లు కూడా మనకు పూవులనుండే వస్తాయి..కాని కివి పండ్ల చెట్లు చెట్ల మాదిరిగా కాకుండా తీగల్లా అల్లుకుని పెరుగుతాయి..ఈ అల్లుకున్న తీగలకు పూచిన పూలన్ని..కివి పండ్లుగా రూపాంతరం చెందుతాయి.
నువ్వులు
చాలా చిన్నవిగా ఉండే నువ్వుల్ని అసలు ఎలా పండిస్తారు అని మీకు ఎప్పుడైనా డౌటొచ్చిందా..అంత చిన్న వాటిని ఒక్కొక్కటిగా ఎలా మొక్క నుండి తెంపుతారు..అసలు నువ్వులు మనకి దొరికేది మొక్కల నుండే అనే విషయం మీకు తెలుసా?? నువ్వుల మొక్కకు పెరిగే మొగ్గల్లాంటి భాగాల లోపల నువ్వులు ఉంటాయి..ఆ మొగ్గల్ని పెరగనిచ్చి..ఎండపెట్టి వాటిని పగుల కొట్టి లోపల ఉన్న నువ్వుల్ని తీస్తారు.
జీడిపప్పు :
Advertisements