Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

క్రిస్ గేల్ కొట్టిన సిక్స్ క‌థ‌…. ఓ కొత్త ఫ్రెండ్ ను ప‌రిచ‌యం చేసిన సిక్స‌ర్.!

Advertisement

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పూనే వారియ‌ర్స్ కు మ‌ద్య IPL మ్యాచ్ జ‌రుగుతుంది.! RCB ఓపెన‌ర్ క్రిస్ గేల్ త‌న స్టైల్లో బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతున్నాడు. లెగ్ స్పిన్న‌ర్ రాహుల్ శ‌ర్మ బౌలింగ్ లో వ‌రుస‌గా 5 సిక్సులు బాదాడు. అత‌డు కొట్టిన నాల్గో సిక్స్ డైరెక్ట్ గా ఆడియ‌న్స్ లోకి వెళ్లి 10 సంవ‌త్స‌రాల బాలిక ముక్కుకు తగిలింది దీంతో ముక్కు విరిగిపోయింది. ర‌క్తమోడుతున్న‌ ఆ పాప‌ను…స్టేడియం నుండి హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు.

Advertisement

ఆ మ్యాచ్ లో …గేల్ మొత్తం 8 సిక్సుల స‌హాయంతో 48 బంతుల్లో 81 ప‌రుగులు చేసి త‌న టీమ్ ను గెలిపించాడు. మ్యాచ్ త‌ర్వాత‌… ఆ పాప ఉన్న హాస్పిట‌ల్ కు వెళ్లి ఆ పాప‌కు సారీ చెప్పాడు. దానికి ఆ పాప చాలా సంతోషించి… “నాకేం కాలేదు…మీ సిక్సులు ఆపొద్దు “అని చెప్పింది. ఫ్రెండ్స్….అంటూ ఇద్ద‌రూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

అప్ప‌టి నుండి గేల్ అప్పుడ‌ప్పుడు ఆ పాప‌ను ప‌ల‌క‌రిస్తూనే ఉన్నాడు. ఆ పాప కూడా గేల్ కు ఫోన్ చేస్తూ మాట్లాడుతుంది. అలా ఆ స్నేహం కంటిన్యూ అవుతూనే ఉంది.

Advertisements