Advertisement
భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ ఉదంతం. 1919 లో రౌలత్ చట్టానికి( తిరుగుబాటు దారులను అణిచే సర్వ హక్కులు వైస్రాయ్ కి ఇవ్వడం) వ్యతిరేకంగా…సత్యపాల్, సైఫుద్దీన్ కీచ్లు లు ప్రజాసభలు నిర్వహిస్తూ ప్రజలను హింస వైపు ప్రేరేపిస్తున్నారని బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది .. వారి అరెస్ట్ ను నిరసిస్తూ సిక్కుల ఆధ్యాత్మిక నూతన సంవత్సరం ( మనకు ఉగాది లాగ ) అయినా బైసాకి పండుగ రోజు పంజాబ్ లోని అమృత్ సర్ దగ్గర్లోని జలియన్ వాలా బాగ్ లో స్థానిక ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న జనరల్ డయ్యర్ 90 మంది సైనికులతో….ఆ ప్రాంతానికి చేరుకొని కాల్పులు ప్రారంభించాడు. ఈ కాల్పుల్లో సుమారు 1000 మంది చనిపోయారు.
Advertisement
ఈ ఘటనపై విచారణ చేపట్టిన హంటర్ కమిషన్ ముందు కాల్పులకు ఆదేశాలిచ్చిన డయ్యర్ మాట్లాడిన మాటలు….
” నాకు ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసింది, అక్కడ సమావేశమైన గుంపు కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాను.
Advertisements
కాల్పులు జరుపకుండా గుంపును చెదరగొట్టొచ్చు…. కానీ వాళ్ళంతా మళ్ళీ తిరిగివచ్చి నన్ను అవహేళన చేస్తే… నేను చేతగానివాడినయ్యుండేవాడిని.
ఆ పార్క్ లోకి వాహనాలు వెళ్ళగలిగితే మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కాని ఇరుకైన సందులలోకి మా సాయుధ వాహనాలు వెళ్ళడం కుదరక తుపాకీ కాల్పులు జరిపాము.
Advertisements
జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం నా బాధ్యత గా ఫీల్ అయ్యాను. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం నా బాధ్యత కాదు కాబట్టి అలాంటి ప్రయత్నమేమీ చేయలేదు”