Advertisement
చైనాకు చెందిన మంగోల్ చక్రవర్తి జంఘీస్ ఖాన్ గురించి ఇప్పటికీ అనేక మంది రక రకాల కథలను చెబుతుంటారు. అప్పట్లో అతను అనేక రాజ్యాలను జయించి చక్రవర్తిగా ఏక ఛత్రాధిపత్యం కొనసాగించాడు. అయితే అతను ఎలా చనిపోయాడనే దానిపై ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయి. అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే అతని సమాధి ఇప్పటికీ కనిపించకపోవడం విశేషం.
జంఘీస్ ఖాన్ ….. చనిపోయే క్షణాల్లో జంఘీస్ ఖాన్ తన కుమారులు, సైనికులతో పలు మాటలు అన్నాడట. నా గురించి ఎవరూ ఏడవకండి, నా మరణం పట్ల జాలి చూపకండి, నా మరణంపై నా శత్రువులను హెచ్చరించండి.. అని జంఘీస్ ఖాన్ చివరి మాటలు మాట్లాడినట్లు చరిత్రకారులు చెబుతారు.
జంఘీస్ ఖాన్ 1227లో గుర్రం మీద నుంచి కిందకు పడిపోవడం వల్ల చనిపోయాడని కొందరు అంటారు. కానీ కొందరు మాత్రం మోకాలుపై బాణాల గాయాలు కావడం వల్ల అనారోగ్యం పాలై చనిపోయాడని అంటారు. ఇక కొందరైతే.. ఓ చైనా యువరాణి కోసం ఆశపడ్డందుకు అతన్ని కొందరు చంపేశారని చెబుతారు. అయితే జంఘీస్ ఖాన్ ఎలా చనిపోయినప్పటికీ చివరి రోజుల్లో మాత్రం అతను తీవ్రమైన శారీరక బాధతో అనేక రోజులు మంచం మీద ఉండి చనిపోయాడన్నది వాస్తవం.
Advertisement
Advertisements
ఇక అతని మృతదేహాన్ని ఉత్తర మంగోలియాలో ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో సమాధి చేశారు. కానీ సరిగ్గా ఏ ప్రాంతం అన్న వివరాలు ఇప్పటికీ తెలియదు. అతని సమాధిని ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. జంఘీస్ ఖాన్ తన సమాధి ఎవరికీ కనిపించకుండా ఉండొద్దని ముందుగానే తన కుమారులు, సైనికులకు చెప్పాడట. అందుకనే వారు ఎక్కడో మారుమూల నిర్మానుష్య ప్రాంతంలో ఎవరికీ కనిపించని చోట అతని మృతదేహాన్ని సమాధి చేశారని చెబుతారు. అందుకనే ఆ సమాధి ఇప్పటికీ ఎవరికీ కనిపించలేదు.
Advertisements
అయితే జంఘీస్ ఖాన్ చనిపోయిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు గాను అప్పట్లో అతని మృతదేహాన్ని తీసుకువెళ్లిన మార్గంలో ఎదురైన ప్రయాణికులందరినీ సైనికులు నిర్దాక్షిణ్యంగా చంపేశారట. ఇక ఒక నదీ ప్రవాహాన్ని దిశను మార్చారట. అలాగే అతని సమాధి కనిపించకుండా ఉండేందుకు చుట్టూ అనేక చెట్లను నాటారట. ఏది ఏమైనా అతని సమాధి మాత్రం ఇప్పటికీ కనిపించకపోవడం పెద్ద మిస్టరీగా మారింది.