Advertisement
నా ఫ్రెండ్ అమిత్ (పేరు మార్చాం) ఒక రోజు క్యాబ్ బుక్ చేసుకుని అందులో వెళ్తున్నాడు. అది షేరింగ్ క్యాబ్. అందువల్ల అందులో అప్పటికే మరో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. వారిద్దరికీ దాదాపుగా 50 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఇద్దరూ పీకలదాకా మద్యం సేవించి ఉన్నారు. అందుకని వారి వద్దకు వెళ్తేనే వాసన వచ్చింది. వారు బ్యాక్ సీట్‌లో కూర్చున్నారు. వారి వద్ద ఎందుకులే అని చెప్పి నా ఫ్రెండ్ ముందు సీట్లో కూర్చుని తన మటుకు తాను హెడ్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నాడు. ఇంతలో ఓ అమ్మాయి ఆ క్యాబ్‌లో ఎక్కేందుకు వచ్చింది. ఆమెకు దాదాపుగా 20 ఏళ్లు ఉంటాయి.
ఆ అమ్మాయి వచ్చే వరకు అంతా నార్మల్‌గానే ఉంది. కానీ ఆమె వచ్చాకే అసలు సమస్య ప్రారంభమైంది. ఎందుకంటే వెనుక ఉన్న ఇద్దరు వృద్ధులు మద్యం సేవించారు.. కనుక వారి పక్కన ఖాళీగా ఉన్న సీట్‌లో కూర్చుకునేందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆమె ముందుకు వచ్చింది. అయితే అప్పటికే ఆమె సమస్యను అర్థం చేసుకున్న నా ఫ్రెండ్ అమిత్ ముందు సీట్లో నుంచి తనకు తానుగా లేస్తున్నాడు. కానీ దాన్ని గమనించని ఆమె కోపంగా.. నేను అమ్మాయినని చూడడం లేదా, లే.. నాకు నీ సీట్ ఇవ్వు.. అని నా ఫ్రెండ్‌తో అంది.
Advertisement
అయినప్పటికీ నా ఫ్రెండ్ ఆమెతో గొడవపడలేదు. ఎందుకంటే తనది చాలా మానవతా హృదయం. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. కనుకనే ఆమెతో గొడవపెట్టుకోలేదు. ఎలాగూ తానే సీట్‌నే ఇచ్చి, తాను వెనుక ఇద్దరు తాగుబోతుల పక్కన కూర్చోవాలనుకున్నాడు కనుక సీట్‌ను ఇచ్చేశాడు.
ఇందులో గమనించిందేమిటంటే.. ఆ యువతి సీట్ ఇవ్వమని మర్యాదగా అడిగి ఉండాల్సింది. హెల్ప్ అడిగే వారు ఎప్పుడైనా కోపం ప్రదర్శించరాదు. కానీ ఆమె జాలి హృదయం కలిగిన నా ఫ్రెండ్ పట్ల అలా కోపంగా ప్రవర్తించింది. నిజానికి నా ఫ్రెండ్ ఆమెకు సీట్‌ను ఇచ్చి ఉండకూడదు. అదేమీ ప్రభుత్వ బస్సు కాదు. రిజర్వేషన్ ప్రకారం లేడీస్ కు సీట్ ఇవ్వడానికి. ప్రైవేట్ షేరింగ్ క్యాబ్. కానీ ఆమె పట్ల జాలి చూపించాడు కనుకనే నా ఫ్రెండ్ అలా చేశాడు. అయినా ఆమె కోపాన్ని ప్రదర్శించింది. ఇలా ఎవరికీ జరగకూడదు. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా అసహ్యం వేస్తుంది..!
Advertisements
Advertisements