Advertisement
మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేసుకోవడమే అనేది పెద్దలు చెప్పే మాట. ఈ మధ్య కాలంలో యువత మద్యానికి ఎక్కువగా బానిస అవుతున్నారు అనే మాట వాస్తవం. అయితే యువత ఎందుకు మద్యానికి బానిసగా మారుతున్నారు అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా అమ్మాయిలు ఎక్కువగా బానిస అవుతున్నారు.
Also Read:బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?
అయితే కొందరు నిపుణులు చెప్పే మాట ప్రకారం… యువత మద్యానికి బానిస కాలేదు. షాప్స్ వద్ద లైన్ లు చూస్తే… రోజు అంతా ఎక్కువగా కష్టపడే వారే ఉంటారు. ఇప్పుడు చదువుకున్న యువత ఏదోక ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కునే పరిస్థితి ఉందనే మాట వాస్తవం. వీరంతా కూడా ఎక్కువగా పని చేయడం రాత్రి సమయాల్లో నిద్ర లేకపోవడం వంటి జరుగుతూ వస్తున్నాయి.
Advertisement
Advertisements
ఈ క్రమంలో పని ఒత్తిడి తగ్గించుకోవడానికి వీకెండ్స్ లో తాగుతున్నారు. తాగి పడిపోయి మరుసటి రోజు ఎప్పుడో లేస్తున్నారు. వాళ్ళ పని ఒత్తిడిలో బానిసలు గా మారి రోజు తాగే అంత సీన్ లేదు. ఇక అమ్మాయిలు కూడా కాస్త కల్చర్ కి అలవాటు పడి అబ్బాయిలను చూసి మత్తులో ఉండటానికి కొన్ని కొన్ని సార్లు ఇష్టపడుతున్నారు గాని తాగడానికి బానిస కావడం అనేది లేదు.
తాగుడు రోజు ఉండేది ఎక్కువగా డబ్బున్న బాబులే గాని డబ్బు లేని వారికి అంత సీన్ లేదు. ఇక ఈ మధ్య కాలంలో ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది యువత. కాబట్టి మద్యం తాగడానికి ఇష్టపడటం లేదు. ఇక అమ్మాయిలకు పని ఒత్తిడి ఉద్యోగాల్లో ఎక్కువగా ఉండటంతో వాళ్ళు కూడా కొన్ని కొన్ని రుచులకు, మత్తులకు అలవాటు పడుతున్నారు.
Advertisements
Also Read:బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?