Advertisement
దుబాయి నుంచి వచ్చే వాళ్ళు కచ్చితంగా ఎంతోకొంత బంగారం తెచ్చుకుంటారు అనే సంగతి తెలిసిందే. దుబాయిలో బంగారం ధర ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండటమే దానికి కారణం. బంగారం కొనడానికి ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశాలలో దుబాయ్ ఒకటి. బంగారం కొనుగోలు విషయానికి వస్తే, అది బులియన్, బార్‌లు లేదా కిలోలు అయినా సరే దుబాయ్‌లో బంగారు దుకాణాలు ఎక్కువగా ఉంటాయి.
Advertisement
నాలుగేళ్ల క్రితం… అంటే 2018 లో దుబాయ్ గవర్నమెంట్ వాల్యూ యాడెడ్ టాక్స్ ను (వ్యాట్) ప్రవేశ పెట్టింది. బంగారం పై 5% పన్ను విదిస్తుంది. ఇతర దేశలతో పోల్చి చూస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. దుబాయ్ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 మరియు టెర్మినల్ 3 బంగారం షాపులు ఉన్నాయి. ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అయితే చాలా మంది చెప్పే మాట… టెర్మినల్ 3 లో మంచి బంగారం దొరుకుతుంది.
Advertisements
అది డ్యూటీ ఫ్రీ కూడా కాబట్టి చాలా మంది అక్కడే కొనాలి అని చెప్తారు. ఇక ఈ షాప్స్ ఎప్పుడూ ఓపెన్ చేసే ఉంటాయి. ఏ టైం లో అయినా సరే వెళ్లి కొనుక్కునే సౌకర్యం ఉంది. అయితే మీరు ఇండియా వచ్చే ముందు అక్కడ బంగారం కొనాలి అనుకుంటే… మన దేశంలో నిబంధనలు దృష్టి లో ఉంచుకుని కొనాలి. మన దేశంలో 10 గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు. అయితే 12.5% కట్టాలి. ఇక జిఎస్టీ 3% కట్టాలి.
Advertisements