Advertisement
నేడు అనగా …. ఏప్రిల్ 24 న పంచాయితీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది. అందుకే ఈ రోజును పంచాయతీ రాజ్ డే గా జరుపుకుంటారు.దాదాపు 30 లక్షల మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న ‘పంచాయితీ రాజ్ వ్యవస్థ’ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. దేశ వ్యాప్తంగా 718 జిల్లా పంచాయితీలు,6,097 మండల పంచాయితీలు, 2,34,676 గ్రామ పంచాయితీలు పనిచేస్తున్నాయి. గణాలకు వెన్నెముకగా పనిచేస్తున్న వీరందరికి మనందరి తరపున పంచాయతీ రాజ్ డే శుభాకాంక్షలు.
చరిత్ర :
ప్రాచీనకాలంలో గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తి వృత్తుల ప్రతినిధులతో పనిచేశేవి…. కులాల వారీగా పెత్తనం సాగేది. స్థానిక ప్రభుత్వం అనే కాన్సెప్ట్ కు బ్రిటిష్ గవర్నర్ జనరల్ రిప్పన్ బీజాలు వేసాడు. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి.
చట్టబద్దత :
పంచాయితీలకు చట్టబద్దత కల్పించడం కోసం పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1991లో పార్లమెంట్‌లో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 1992లో ఆమోదం పొందింది. రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన బిల్లు కనుక దీన్ని 50 శాతం కన్నా తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలి. ఈ బిల్లుకు 17 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. నాటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మ ఈ బిల్లుపై 1993 ఏప్రిల్ 20న సంతకం చేశారు. ఇది 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
Advertisement
రాజ్యాంగం లోని IXవ భాగంలో 243, 243 ‘A’ నుంచి 243 ‘O’ వరకు పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన వివరణను 11వ షెడ్యూల్‌లో పంచాయతీలు నిర్వర్తించాల్సిన 29 విధులను చేర్చారు.
Advertisements

Gram Panchayati- Algol
గ్రామ పంచాయతీలు చేయాల్సిన 29 పనులు:
1.వ్యవసాయం వ్యవసాయ విస్తరణ.
2.భూసంస్కరణలు పరిరక్షణ.
3.చిన్నతరహా సాగునీటి పథకాలు నీటి పరిరక్షణ
4.పశువుల సంరక్షణ పాల ఉత్పత్తులు కోళ్ల పరిశ్రమలు
5.చేపలు
6.సామాజిక అడవులు
7.చిన్నతరహా అటవీ ఉత్పత్తులు
8.చిన్న తరహా పరిశ్రమలు ఆహార ఉత్పత్తి పరిశ్రమలు
9.ఖాదీ నూలు పరిశ్రమలు
10.గ్రామీణ గృహ వసతి పథకాలు
11.తాగునీటి వసతి
12.రోడ్లు బ్రిడ్జీలు ఇతర సమాచార వ్యవస్థలు
13.ఇంధన ఉత్పత్తులు పశువుల మేత
14.గ్రామీణ విద్యుదీకరణ విద్యుత్ పంపిణీ
15.సాంప్రదాయ ఇంధన వనరుల అభివృద్ధి
16.పేదరిక నిర్మూలన పథకాలు
17.వైద్య పాథ్రమిక ఉన్నత స్థాయి విద్య
18.పారిశ్రామిక శిక్షణ వృత్తి శిక్షణ
19.వయోజన విద్య
20.గ్రంధాలయాలు
21.సాంస్కృతిక కార్యక్రమాలు
22.వ్యాపార, వ్యాపార ప్రదర్శనలు
23.ఆరోగ్యం పరిసరాలు పరిశుభ్రత
24.కుటుంబ పరిరక్షణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
25.మహిళా శిశు సంక్షేమం
26.సామాజిక సంక్షేమం వికలాంగులకు చేయూత
27.బలహీన వర్గాల సంరక్షణ షెడ్యూల్ కులాల తెగల సంరక్షణ
28.ప్రజా పంపిణీ వ్యవస్థ
Advertisements
29.సామాజిక ఆస్తుల పరిరక్షణ