Advertisement
మన దేశంలో అనేక మంది రాజులు పూర్వం పలు ప్రాంతాలను పాలించారు. మౌర్యులు, గుప్తులు, చోళులు, విజయనగర సామ్రాజ్యం రాజులు, పాండ్యులు, శాతవాహనులు, కళింగులు.. ఇలా ఎంతో మంది రాజులు ఎన్నో రాజ్యాలను ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. అయితే అందరికీ గుర్తింపు వచ్చింది. కానీ మన దేశంలో ఒకటైన అస్సాంను ఒకప్పుడు పాలించిన అహోం సామ్రాజ్యం రాజుల గురించి చాలా మందికి తెలియదు.
అహోం సామ్రాజ్యం 1228 నుంచి 1826 వరకు కొనసాగింది. తరువాత బర్మా వారు ఈ సామ్రాజ్యంపై దాడి చేసి ఆక్రమించుకున్నారు. అనంతరం బ్రిటిష్ వారి రాకతో ఈ ప్రాంతం కూడా వారి పాలనలోకి వెళ్లింది. నిజానికి పైన తెలిపిన ఇతర సామ్రాజ్యాలలా అహోం సామ్రాజ్యం కూడా గొప్పదే. కానీ దీని గురించి చాలా మందికి తెలియదు. దీనికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. అన్నేళ్ల పాటు ఈ సామ్రాజ్యం తిరుగులేకుండా కొనసాగింది. ఎంతో మంది రాజులు అహోం రాజులపై దండెత్తి యుద్ధాలు చేశారు. కానీ అహోం ఎదుట నిలబడలేకపోయారు.
Advertisement
ఒకప్పుడు మొగల్ చక్రవర్తులు అత్యాధునిక ఆయుధాలు, భారీ సైన్యం ఉండి కూడా అహోం సామ్రాజ్యంపై 17 సార్లు దండెత్తి యుద్ధం చేసి ఓడిపోయారు. అంతటి ఘన చరిత్ర అహోం సామ్రాజ్యంకు ఉంది. అహోంపై చివరిసారిగా రామ్ సింగ్ చక్రవర్తి భారీ సైనిక బలగంతో దండెత్తి యుద్ధం చేశాడు. అయితే అంతటి భారీ సైనిక సంపత్తి ఉన్నప్పటికీ రామ్ సింగ్ ఓడిపోయి అక్కడి నుంచి బెంగాల్‌కు పారిపోయాడు.
Advertisements
Advertisements
అహోం సామ్రాజ్యాన్ని ఒకప్పుడు లక్‌చిత్ బొర్ఫుకన్ అనే యోధుడు పాలించాడు. అహోం సామ్రాజ్యం చరిత్రలోనే ఇతను గొప్ప పరాక్రమాలు కలిగిన వాడిగా పేరుగాంచాడు. ఇక అప్పట్లో అహోం సామ్రాజ్యం చాలా శక్తివంతంగా ఉండేది. ఆర్థికంగా, సైన్యం పరంగా అన్ని రంగాల్లోనూ దృఢంగా ఉండేది. అందుకనే ఆ రాజ్యంపై ఎవరు దండెత్తినా ఓడిపోయేవారు. అయితే బ్రిటిష్ వారు ఆ ప్రాంతాన్ని పాలించినా ఇప్పటికీ అస్సాం వారు అహోం సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. వారు అప్పటి తమ పూర్వీకుల ఆచార వ్యవహారాలను మరువలేదు.
భారతదేశంలో ఎన్నో సామ్రాజ్యాల చరిత్రలను చాలా మంది చదువుకున్నారు. కానీ అహోం సామ్రాజ్యం చరిత్ర ఎక్కడా ఎవరూ చదవలేదు. అంతటి గొప్ప సామ్రాజ్యానికి చరిత్రలో చోటు దక్కకపోవడం బాధాకరం. అయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పాస్ అయ్యే ఉత్తమ అభ్యర్థులకు లక్‌చిత్ బొర్ఫుకన్ మెడల్‌ను అందజేస్తారు. ఆ సామ్రాజ్యానికి చెందిన ఆ వీరుడిని గుర్తు చేసుకుంటూ ఆ మెడల్‌ను అందజేస్తారు.