Advertisement
యుద్ధంలో పాల్గొనే సైనికులు సహజంగానే శత్రుదేశాలకు చెందిన సైనికులు వాడే అన్ని ఆయుధాల నుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో గ్రెనేడ్లు కూడా ఒకటి. అవి విసిరితే బ్లాస్ట్ అవుతాయి కనుక వాటి నుంచి ఎవరైనా సరే తప్పించుకోవాలనే చూస్తారు. అయితే ఆ సైనికాధికారి మాత్రం తప్పించుకోలేదు. గ్రెనేడ్‌పై పడుకున్నాడు. తన తోటి సైనికులను కాపాడాడు. అంతేకాదు.. తాను కూడా స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. ఏంటీ.. షాకింగ్‌గా ఉందా.. అయినా ఇది నిజమే..
గ్రెనేడ్ మీద పడ్డాక తప్పించుకునే అవకాశం లేకపోతే సహజంగానే దాని బ్లాస్ట్‌కు మరణిస్తారు. లేదా తీవ్ర గాయాలకు గురవుతారు. కానీ అతను ఏకంగా గ్రెనేడ్‌పై పడుకున్నా అతనికి ఏమీ కాలేదు. ఇది నమ్మశక్యంగా లేకున్నా నిజంగానే జరిగింది. బ్రిటన్‌కు చెందిన మాథ్యూ క్రౌచర్ అనే సైనికాధికారి అక్కడి రాయల్ మెరైన్స్ రిజర్వ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. 2008 ఫిబ్రవరి 9వ తేదీన ఆప్ఘనిస్థాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో ఉన్న సంగిన్ అనే ప్రాంతంలో ఓ మిషన్ నిమిత్తం అతను వెళ్లాడు. ఆ రోజు మిషన్‌లో ఉండగా.. అతని కాలు ఓ ట్రిప్‌వైర్‌ను తాకింది. అది ఒక ట్రాప్. దాంతో ఆ ట్రాప్‌కు అమర్చబడిన ఓ గ్రెనేడ్ పై నుంచి వచ్చి కింద పడింది. అది కేవలం కొన్ని సెకన్లలో పేలుతుందనగా.. క్రౌచర్ దానిపై వెల్లకిలా పడుకున్నాడు. వీపు భాగం గ్రెనేడ్‌కు టచ్ అయ్యేలా దాన్ని కవర్ చేస్తూ దానిపై పడుకున్నాడు. బ్లాస్ట్ అయింది. కానీ అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక తన చుట్టూ ఉన్న తోటి సైనికులు కూడా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
Advertisement
కాగా మాథ్యూ క్రౌచర్ అలా అంతులేని ధైర్య సాహసాలను ప్రదర్శించి తోటి సైనికులను రక్షించడం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టడంతో బ్రిటన్ ప్రభుత్వం అతనికి అక్కడి అత్యుత్తమ గ్యాలెంట్రీ అవార్డు జార్జ్ క్రాస్‌ను ప్రదానం చేసింది.
Advertisements
Advertisements
అయితే క్రౌచర్ గ్రేనెడ్ బ్లాస్ట్ నుంచి స్వల్ప గాయాలతో ఎలా తప్పించుకున్నాడనే విషయంపై నిపుణులు పరిశోధనలు చేశారు. చివరకు తేలిందేమిటంటే.. ఆ సమయంలో అతను బాడీ ఆర్మర్ (రక్షణ కవచం) ధరించి ఉన్నాడు. అలాగే తోటి సైనికులకు కూడా రక్షణ కవచాలు ఉన్నాయి. అందుకనే క్రౌచర్‌కు ఏమీ కాలేదని తెలిపారు. ఆర్మర్ లేకుండా ఉంటే క్రౌచర్ గ్రెనేడ్ బ్లాస్ట్‌కు చనిపోయేవాడని అన్నారు. దీని వల్ల సైనికులకు కూడా ఒక కొత్త ట్రిక్ తెలిసింది. బాడీ ఆర్మర్ ధరించి ఉంటే అలా గ్రెనేడ్‌పై పడుకుంటే.. తమను తాము కాపాడుకోవచ్చని రుజువైంది. ఏది ఏమైనా.. క్రౌచర్ సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.