Advertisement
మొలకెత్తిన విత్తనాలను తింటే ఎన్ని రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జనాలు వాటికి బదులుగా మైక్రో గ్రీన్స్‌ను ఎక్కువగా తింటున్నారు. మైక్రోగ్రీన్స్ అంటే.. విత్తనాలు మొలకెత్తాక వాటిని పెంచితే మొక్కలుగా మారుతాయి. అయితే విత్తనాలు మొక్కలుగా మారే క్రమంలో అవి చాలా చిన్న మొక్కలుగా ఉండగానే వాటిని సేకరించాలి. వాటినే మైక్రో గ్రీన్స్ అంటారు. ప్రస్తుతం చాలా మంది మైక్రో గ్రీన్స్‌ను తింటున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ కూడా బాగానే పెరిగింది. దీంతో అనేక మంది ఇండ్లలోనే మైక్రోగ్రీన్స్‌ను పెంచుతున్నారు.
మైక్రోగ్రీన్స్ పెంచేందుకు ఎక్కువగా స్థలం అవసరం లేదు. బాల్కనీలు, బంగ్లా, కిటికీల వద్ద కుండీల్లోనూ చాలా తక్కువ స్థలంలో వీటిని పెంచవచ్చు. అందుకు గాను వీటికి తగినంత సూర్యరశ్మి లభించేలా చూస్తే చాలు. అవి సులభంగా మొలకెత్తి పెరుగుతాయి.
మైక్రోగ్రీన్స్‌లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు వీటిల్లో మిక్కిలిగా ఉంటాయి. అందువల్ల వీటిని సూపర్‌ఫుడ్స్‌గా చెప్పవచ్చు. వీటిని సలాడ్లు, శాండ్ విచ్‌లు, ఇతర వంటకాల్లో వేసి తింటారు.
Advertisements
మైక్రోగ్రీన్స్ పట్ల గుర్తుంచుకోవల్సిన విషయాలు:
Advertisement
* మైక్రోగ్రీన్స్‌ను కార్డ్ బోర్డ్ బాక్స్‌లు, ట్రేలలోనూ పెంచవచ్చు. అయితే నీరు కిందకు వెళ్లేందుకు డ్రైనేజీ హోల్స్ ఉండాలి. కనీసం 2 ఇంచుల వరకు ఎత్తులో మట్టి ఉండేలా చూసుకోవాలి.
* మొదటి 3 రోజుల పాటు నిత్యం నీటిని స్ప్రే చేయాలి. దీంతో తేమ సరిగ్గా ఉంటుంది. మైక్రోగ్రీన్స్ త్వరగా పెరుగుతాయి.
* తాజాగా ఉన్నప్పుడే మైక్రోగ్రీన్స్ రుచి బాగుంటుంది. కనుక వాటిని సేకరించిన వెంటనే అమ్మేయాలి. లేదా 2 రోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి అమ్మవచ్చు.
* వీలైనంత వరకు ఆర్గానిక్ పద్ధతిలో మైక్రోగ్రీన్స్ ను పెంచాలి.
* సారవంతమైన మట్టిలో మైక్రోగ్రీన్స్ ను పెంచితే చక్కగా పెరుగుతాయి.
* మైక్రోగ్రీన్స్ పెరిగేందుకు నీరు అవసరమే. అలా అని చెప్పి అవసరానికి మించి నీటిని పోయకూడదు.
Advertisements
మైక్రోగ్రీన్స్ పెరిగేందుకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు. కేవలం 4 నుంచి 6 రోజుల్లోనే అవి పెరుగుతాయి. అందువల్ల ఎక్కువగా ఎరువులను వాడాల్సిన పని కూడా ఉండదు. ఇక మెంతులు, గోధుమలు, పెసలు, ఆవాలు తదితర విత్తనాల ద్వారా మైక్రోగ్రీన్స్ ను పెంచి విక్రయించవచ్చు. అలాగే విత్తనాలను విత్తిన తరువాత 24 గంటల పాటు వాటిని చీకటి ప్రదేశంలో ఉంచాలి. తరువాతే సూర్య రశ్మి తగిలే చోటుకు వాటిని మార్చాలి. ఇక పూర్తిగా నీటిని మాత్రమే వాడుతూ హైడ్రోపోనిక్స్ విధానం ద్వారా కూడా మైక్రోగ్రీన్స్ ను పెంచవచ్చు. ఎలా పెంచి విక్రయించినా సరే తాజాగా వీటిని ఎప్పటికప్పుడు విక్రయిస్తే లాభాలు ఆర్జించవచ్చు.