Advertisement
కుందనపు బొమ్మలా ఉన్న ఈమె పేరు గులిస్తా, ఢిల్లికి చెందిన జమీల్ ఖురేషీ 6 గురు సంతానంలో 4 వ అమ్మాయి.! అది 2018 మే 21., మరో రెండు రోజుల్లో ఆమె వివాహం కానుంది. ఇంట్లో అందరూ పెళ్లి పనులు చేసి అలసి పోయి …ఆదమరిచి నిద్రపోతున్నారు. సరిగ్గా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఒక లీటర్ యాసిడ్ గులిస్తా ముఖంపై పోసి పారిపోయాడు.!
పెళ్లికి ముస్తాబవ్వాల్సిన గులిస్తా…హాస్పిటల్ బెడ్ మీద ఉంది. అందమైన ఆమె ముఖం యాసిడ్ ధాటికి మాడిపోయింది. విపరీతమైన నొప్పిని భరించలేకపోతుంది. అంతలోనే ఏమీ తెలియనట్టు ఓ వ్యక్తి వచ్చి గులిస్తా తల్లితో గులిస్తా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడు. అతడిని గుర్తించిన గులిస్తా తన మీద యాసిడ్ పోసింది అతనేనన్న విషయాన్ని తెలిపింది.
Advertisement
Advertisements
గులిస్తా, షారుఖ్ లు ప్రేమించుకున్న మాట నిజం, కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా గులిస్తా షారుఖ్ ను కాదనుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పగ పెంచుకున్న షారుఖ్ గులిస్తాను వేధించడం స్టార్ట్ చేశాడు. ఎన్ని విధాలుగా చెప్పిచూసిన వినకుండా తన శాడిజాన్ని చూపిస్తూనే ఉన్నాడు. పెళ్లికి రెండు రోజుల ముందు ఏకంగా తనకు దక్కని అమ్మాయి మరెవ్వరికీ దక్కొద్దంటూ ఈ పనిచేశాడట.! తల్లి సమాచారంతో పోలీసులు షారుఖ్ ను అరెస్ట్ చేశారు. 45 రోజులు మృత్యువుతో పోరాడిన గులిస్తా చనిపోయింది.
Advertisements
ప్రేమ అంటే ఇదేనా…. ప్రేమ మరణాన్నే కోరుకుంటుందా? అనే అనేక ప్రశ్నలను మన ముందుంచిన ఘటన ఇది.!