Advertisement
ఎటు నుండి వస్తుందో తెలియని మాయరోగం కరోనా..దాని నుండి తనతో పాటు తన నెలల పసిబిడ్డను రక్షించుకోవాల్సిన సమయం అది..అయినప్పటికి తన బిడ్డ రక్షణతో పాటు, నగర ప్రజల రక్షణ కూడా ముఖ్యం అనుకున్నారు ఐఏఎస్ అధికారిణి. అందుకే క్షణం ఆలోచించకుండా తన లీవ్ ని క్యాన్సిల్ చేసుకుని విధుల్లో చేరారు విశాఖ GVMC కమిషనర్ సృజన గుమ్మళ్ల..
కరోనా విజృంభణను అరికట్టడానికి లాక్ డౌన్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అంతకు ఇరవై రోజుల ముందే బిడ్డకు జన్మనిచ్చారు సృజన.. డెలివరికి హాస్పిటల్ కి వెళ్లడానికి గంట ముందు వరకు కూడా విధుల్లోనే ఉన్నారు..బిడ్డ పుట్టిన తర్వాత మెటర్నిటి లీవ్ తీసుకున్నారు. ఇంతలో కరోనా ముప్పు వచ్చింది. ఈ సమయంలో తాను ఇంట్లో కూర్చోవడం సరి కాదు అని ఇరవై రెండు రోజుల వయసున్న బిడ్డని భర్తకి అప్పగించి తన లీవ్ క్యాన్సిల్ చేసుకుని మళ్లీ విధుల్లో చేరారు.
ఒకవైపు కరోనా, మరోవైపు గ్యాస్ లీకేజ్ తో విశాఖ నగరం చిన్నాబిన్నమైనంది.అటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా విధులు నిర్వర్తించారు సృజన.. కరోనా విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలతో పాటు లాక్ డౌన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ..గ్యాస్ లీకేజ్ ఘటన అప్పుడు ప్రజలకు సాయం చేయడంలోనూ రెండు సంధర్బాల్లోనూ ముందుండి ప్రజలను నడిపించారు. సృజన పని తీరు పట్ల ముందు నుండి విశాఖవాసులకు ప్రత్యేక అభిమానం..ఇప్పుడు ఆ అభిమానం రెట్టింపయింది.
Advertisement
తగిన జాగ్రత్తలతోనే విధులకు హాజరయిన సృజన కొన్ని సంధర్బాల్లో బిడ్డను కూడా ఆఫీస్ కి తీసుకు రావలసిన పరిస్థితి..అటువంటి సంధర్బాల్లో ఒక చేత్తో బిడ్డని లాలిస్తూనే..మరో చేత్తో నగరాన్ని పాలించారు.. ప్రస్తుతం సృజనకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది..ఇంత మధురంగా తన బిడ్డకి జోలపాట పాడుతున్న ఈ వ్యక్తి ఎవరో చెప్పుకోండి అంటూ వైరలవుతోన్న ఆ వీడియోని మీరు చూడండి.. తల్లి పాడుతున్న పాటని తన్మయత్వంతో వింటున్న బాబుని చూడండి..మరో ముఖ్య విషయం ఏంటంటే తను కూచిపూడి నృత్యకళాకారిణి కూడా..
Advertisements
Watch Video:
Advertisements