Advertisement
కురులను మోకాళ్ల వరకు పెంచుకోవాలని..రకరకాల హెయిర్ స్టైల్ తో అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది! కానీ అందం కంటే కూడా ఇతరులలో ఆత్మస్థైర్యం నింపడమే మంచి కార్యమని భావించిన ఈ అమ్మాయి 24 ఇంచుల తన జడను కత్తిరించి…విరాళంగా ఇచ్చేసింది!
క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి విగ్గులు తయారు చేసి ఉచితంగా ఇచ్చే ఓ స్వచ్చంధ సంస్థకు తన జుట్టును డొనేట్ చేసి ఆదర్శంగా నిలిచింది ఈ పాప! సాధారణంగా క్యాన్సర్ పేషెంట్స్ తమ జుట్టును కోల్పోతుంటారు…దీంతో వారిలో ఆత్మనూన్యతా భావం ఎక్కువై ఫీల్ అయిపోతుంటారు.! వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి చాలా మంది తమ జుట్టును డొనేట్ చేస్తూనే ఉన్నారు. మీకు అలా డొనేట్ చేయాలనిపిస్తే….ఇలాంటి స్వచ్చంద సంస్థలకు కాల్ చేసి మీ జుట్టును డొనేట్ చేయండి….క్యాన్సర్ పేషెంట్ ముఖంలో ఆనందానికి కారణమవ్వండి!
హైద్రాబాద్ కు చెందిన ఓ స్వచ్చంద సంస్థ ఇలాంటి పనిచేస్తూ ఇప్పటికే మంచి గుర్తింపు పొందింది ….ఈ సంస్థ ఫోన్ నెంబర్ ను మీకోసం -9666406586.
హెయిర్ డొనేషన్ చేసిన ఇంకొంతమంది …వీరిని అభినందిద్దాం!
Advertisements
Advertisement
Advertisements