Advertisement
ఆంజనేయ స్వామి భక్తులు ప్రతి మంగళ, శనివారాల్లో ఆయనను పూజిస్తారన్న సంగతి తెలిసిందే. హనుమాన్ పూజలో హనుమాన్ చాలీసాకు మిక్కిలి ప్రాధాన్యం ఉంటుంది. పూజలు చేసేవారు చాలీసాను కచ్చితంగా చదువుతారు. అయితే దీన్ని గోస్వామి తులసీదాస్ రచించాడు. 16వ శతాబ్దంలో ఆయన దాన్ని అవధి అనే భాషలో రాశారు. ఇక చాలీసా అనే పదం చాలీస్ నుంచి వచ్చింది. చాలీస్ అంటే 40 అని అర్థం వస్తుంది. అంటే.. హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలు ఉంటాయన్నమాట. వాటిల్లో ఒక లైన్‌లో సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న దూరం గురించిన ప్రస్తావన ఉంటుంది.
హనుమాన్ చాలీసాలో 18వ శ్లోకం చూస్తే…
యుగ సహస్ర యోజన పర భాను |
లీల్యో తాహి మధుర ఫల జానూ ||
పైన తెలిపిన శ్లోకానికి… 12వేల దైవ మైళ్ల దూరంలో ఉన్న సూర్యున్ని తియ్యని పండు అనుకుని నువ్వు మింగాలనుకున్నావు… అని అర్థం వస్తుంది.
Advertisements
Advertisement
ఇక్కడ యుగం అంటే నాలుగు యుగాలను కలిపి అని అర్థం చేసుకోవాలి. అంటే 1 పూర్తి మహాయుగం అన్నమాట.
సత్యయుగం = 4800 దైవ సంవత్సరాలు
త్రేతాయుగం = 3600 దైవ సంవత్సరాలు
ద్వాపరయుగం = 2400 దైవ సంవత్సరాలు
కలియుగం = 1200 దైవ సంవత్సరాలు
కనుక.. 1 దైవ యుగం అంటే మొత్తం 12వేల దైవ సంవత్సరాలు అన్నమాట. ఇక సంస్కృతంలో సహస్ర అంటే 1000 అని అర్థం. 1 యోజన అంటే సుమారుగా 8 మైళ్లు. కనుక.. 12,000 x 1000 x 8 = 96,000,000 మైళ్లు.
కాగా సైంటిస్టుల లెక్కల ప్రకారం సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న దూరం దాదాపుగా 92,960,000 మైళ్లు అని తేలింది. ఇక సూర్యుని చుట్టూ భూమి ఎల్లప్పుడూ నిర్దిష్టమైన కక్ష్యల్లో తిరుగుతుంటుంది కనుక ఆ దూరం సీజన్లను బట్టి మారుతుంది. వేసవిలో ఉత్తరార్ధ గోళంలో సూర్యుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు. కనుక అప్పుడు రెండు గ్రహాల మధ్య దూరం తగ్గుతుంది. అదే శీతాకాలంలో దూరంగా ఉంటాయి. కనుక ఇరు గ్రహాల మధ్య దూరం పెరుగుతుంది.
అయితే సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న దూరాన్ని 17వ శతాబ్దంలో నూతన పద్ధతులను ఉపయోగించి కనుగొన్నారు. కానీ హనుమాన్ చాలీసాలో అంతకు ఒక శతాబ్దం ముందే రెండు గ్రహాల మధ్య దూరాన్ని కచ్చితంగా తెలియజేశారు. ఇది వారి గొప్పతనం అనుకోవాలి.
Advertisements