Advertisement
ఇటీవల అమెరికాలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది.. డెలావెర్ రాష్ట్రంలోని హాకెసిన్ నగరంలో విగ్రహప్రతిష్టాపనకై తయారు చేయబడిన ఈ విగ్రహం మన రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంది..ఆ విగ్రహం ప్రత్యేకతలు..ఇక్కడ నుండి అమెరికాకు ఎలా తీసుకువెళ్లారు అనే ఆసక్తికర విషయాలు మీకోసం..
విగ్రహ ప్రత్యేకత…
అమెరికా లో ఇప్పటికే అనేక హిందు దేవాలయాలు,విగ్రహాలు ఉన్నాయి..కానీ వాటన్నింటిలోకి ఈ విగ్రహమే అత్యంత ఎత్తయిన విగ్రహం..విగ్రహం 25అడుగుల ఎత్తు, ముప్పై వేల కేజీల బరువు.. ఇతర విగ్రహాలతో పోలిస్తే స్టాట్యూ ఆఫ్ అవర్ లేడీ క్వీన్ విగ్రహం ఎత్తైనది..హనుమాన్ విగ్రహం రెండవ స్థానం.. హిందూ దేవుళ్ల విగ్రహాలతో పోలిస్తే ఈ విగ్రహమే ఎత్తైనది..
Advertisements
Advertisement
విగ్రహ తయారి..
ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోనే తయారు చేశారు.. 300వందల పైగా కుటుంబాలు, అనేక మంది శిల్పులు కష్టపడి ఈ విగ్రహ తయారికి నల్లటి గ్రానైట్ ని ఉపయోగించారు..ఈ విగ్రహాన్ని ఏకశిలతో తయారు చేయడం విశేషం..విగ్రహం తయారికి సంవత్సరంపైనే కష్టపడ్డారు.
రవాణా..
వరంగల్ లో తయారు కాబడిన ఈ విగ్రహాన్ని పెద్ద ట్రక్కులో ముంబై వరకు తీసుకెళ్లి..అక్కడి నుండి సముద్ర మార్గం ద్వారా నౌకలో న్యూయార్క్ కి ..అక్కడి నుండి డెలావెర్ కు ట్రక్ ద్వారా తరలించారు..జనవరిలోనే ఈ విగ్రహం న్యూయార్క్ కి చేరుకుంది.అక్కడి నుండి హాకెసిన్ నగరానికి చేరడానికి మరికొన్ని రోజులు పట్టింది.. మంచి ముహుర్తం చూసి విగ్రహ ప్రతిష్ట చేద్దామనుకునే లోపు కరోనా విజృంభన, లాక్ డౌన్ తదితర కారణాల రిత్యా ఆలస్యమైంది..
విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత 5రోజుల పాటు పూజలు చేశారు..ఈ పూజా కార్యక్రమాలంలో కేవలం హిందువులు, భారతీయులే కాకుండా, అమెరికన్ సెనెటర్ క్రిస్ కూన్స్, న్యూ క్యాసిల్ కౌంటీ ఎగ్జిక్యూటివ్ మ్యాట్ మయర్, డెలవేర్ లెఫ్టినెంట్ గవర్నర్ బెథనీ హాల్ లాంగ్ సైతం వి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు..
Advertisements