Advertisement
బాలకృష్ణ అంటే అభిమానం ఉండేది. కానీ అది ఆదిత్య 369 సినిమాతో పీక్స్ కు వెళ్లింది. 90 జనరేషన్ వారికి ఆ సినిమా ఓ మధుర జ్ఞాపకం.! వర్తమాన కాలం నుండి భూతకాలంలోకి అక్కడి నుండి భవిష్యత్ కాలంలోకి సినిమా నడక.. నభూతో న భవిష్యత్.! మూసధోరణిలో సాగిపోతున్న తెలుగు సినిమాకు సరికొత్త భాష్యం మా బాలయ్య బాబు సినిమా.!
1)టైం మిషన్:
ఆదిత్య 369 అనగానే టక్కున గుర్తుకు వచ్చేది టైం మెషీన్… అదో కొత్త కాన్సెప్ట్.! సినిమా అయ్యాక నేను మా బ్యాచ్ కొన్ని రోజులు టైం మెషీన్ కనిపెట్టాలని…ఏవేవో పిచ్చి ప్రయోగాలు కూడా చేసేశాం.!
2) బాలకృష్ణ డ్యుయల్ రోల్ :
టివీలు రిపేర్ చేసే కృష్ణ మోహన్ గా, శ్రీకృష్ణ దేవరాయలుగా బాలయ్య బాబు నటన కేకో కేక.! ముఖ్యంగా తన రాజసంతో శ్రీకృష్ణ దేవరాయలను కళ్ళకు కట్టారు.
Advertisements
3) బాలయ్య చెప్పిన పద్యం:
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో… కవితా గోష్టి జరుగుతున్న సమయంలో తెనాలి రామకృష్ణుడు చెప్పబోయే పద్యాన్ని ముందే చెప్పి వాహ్వా అనిపించాడు బాలకృష్ణ . సాధారణంగానే తెలుగు భాషపై గట్టిపట్టున్న బాలయ్యకు పౌరాణిక పద్యాలంటే మరీ ఇష్టం.
Advertisements
4) కోహినూర్ వజ్రం:
తెలుగు నేల కీర్తిని ఇనుమడింపజేసిన వజ్రం ది కోహినూర్. ఈ సినిమా చూశాకే…ఆ వజ్రం విలువ తెలిసింది.

Image Source ; Telugu One
5) తరుణ్
బాలనటుడిగా తరుణ్ ను నేను చూసింది అక్కడే… మాతో పాటే పెరిగి పెద్దై తర్వాత నువ్వే కావాలి సినిమా తో మాకు మరింత దగ్గరయ్యాడు.!
Advertisement
6) అష్టదిగ్గజకవులు:
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది కవులు ఎవరికి వారే తోపులు అని పుస్తకాల్లో ఉంటుంది. ఈ సినిమాలో కంటికి కనిపిస్తుంది. ఒక్కొక్కరి టాలెంట్… అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరామ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు ఉండేవారు. వీరినే అష్టదిగ్గజ కవులుగా పిలిచేవారు. ఈ చిత్రంలో తెనాలి రామకృష్ణుడిగా చంద్రమోహన్ నటన భళీ.!

Image Source : Telugu One
7) జంధ్యాల:
ఆదిత్య 369 సినిమాకు అధ్బుతమైన మాటలు రాశారు. సుత్తివేలు కామెడీ సీన్స్ సూపర్.! ఆ సినిమా తర్వాత కనపడిన పోలీస్ లను పోలీస్ మామయ్య అని పిలుచుకునే వాళ్లం.!
8) ఇళయరాజా:
సెంచరీలు కొట్టే వయస్సు మాది, జానవులే నెర జానవులే.., రాసలీల వేళ….అప్పట్లో ఈ పాటల భావాలు అర్థం కాలేదు కానీ….వింటూ అయితే ఎంజాయ్ చేశాం. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్… లిరిక్స్ లెజెండ్స్ వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి.!
9) మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా:
సింగీతం శ్రీనివాసరావు కథ,స్క్రీన్ ప్లే ఒకెత్తైతే, దర్శకత్వ ప్రతిభతో మెప్పించారు. టాలీవుడ్ లో తెరకెక్కిన మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఇప్పటికీ ‘ఆదిత్య 369’సినిమా నిలిచింది.

Image source : Telugu One
10) రికార్డుల మోత
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.9 కోట్లు వసూల్ చేసింది. అప్పట్లో ఇదో రికార్డు. ఈ చిత్రాన్ని తమిళ్ లో ‘అపూర్వ శక్తి 369’, హిందీలో ‘మిషన్ 369’ గా డబ్ చేశారు. 2008లో ఈ చిత్రాన్ని ‘లవ్ స్టొరీ 2050’ గా రీమేడ్ చేశారు.
సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను మిక్స్ చేసి అందరిచే సూపర్ అనిపించుకుంది ఆదిత్య 369 సినిమా.
హ్యాపీ బర్త్ డే బాలయ్య బాబు గారు.!