Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

హ‌- ప్ర‌యోగం…..రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుందా? త‌గ్గిస్తుందా? ఫ‌ర్ఫెక్ట్ వివ‌ర‌ణ‌!

Advertisement

పెళ్లికాని వారికి…భాగ‌స్వామ్యుల‌కు దూరంగా ఉన్న‌వారికి హ‌- ప్ర‌యోగం ఓ సుర‌క్షిత‌మైన మార్గం…అయితే దానికి పై నిన్నామొన్న‌టి వ‌ర‌కు ఒక ర‌క‌మైన అపోహ‌లు ఉండేవి…. కోవిడ్ టైమ్ లో ఇప్పుడు మ‌రో ర‌క‌మైన అపోహ‌లు అంతే వేగంగా ప్ర‌చార‌మౌతున్నాయి….వాటి గురించి ఇప్పుడు ప‌రిశీలిద్దాం!

గ‌తంలో…..హ‌- ప్ర‌యోగం చేసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి తగ్గుతుంద‌నే ప్ర‌చారం ఉండేది.! దీనికి కార‌ణం ఒక వంతు వీర్యం కోల్పోతే….దానికి 4 రెట్ల ర‌క్తం శ‌రీరం నుండి కోల్పోతామ‌ని ఓ అపోహ చాలా బ‌లంగా నాటుకుపోయింది…అందుకే కొన్ని మ‌త గ్రంథాల్లో దీనిపై నిషేదం కూడా ఉంది.! కానీ త‌ర్వాత సైంటిస్టులు ఇది సుర‌క్షిత‌మైన మార్గ‌మ‌ని…ఇలా చేయ‌డం ద్వారా… ప్రొస్టేట్ క్యాన్స‌ర్ రాకుండా త‌మ‌ను తాము కాపాడుకోవొచ్చని ఆధార‌ల‌తో నిరూపించారు.! ( హ‌- ప్ర‌యోగం చేసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి తగ్గుతుంద‌నేది అబ‌ద్దం)

Advertisement

మ‌రి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుందా? :

Advertisements

సాధార‌ణంగా భావ ప్రాప్తి స‌మ‌యంలో…..ఆటోమేటిక్ గానే తెల్ల‌ర‌క్త‌క‌ణాల ఉత్ప‌త్తి కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది…. ఈ తెల్ల ర‌క్త‌క‌ణాలు శ‌రీరానికి ర‌క్ష‌క భ‌టుల మాదిరిగా ప‌నిచేసి ఇన్ఫెక్ష‌న్స్ నుండి మ‌న‌ల్ని కాపాడుతాయి… ఈ స‌మ‌యంలో విడుద‌ల‌య్యే తెల్ల ర‌క్త‌క‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌…..దీనిని ఆధారంగా చేసుకొని హ‌- ప్ర‌యోగం చేసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క పెరుగుతుంది అనుకోవ‌డం త‌ప్పు.!

Advertisements