Advertisement
నల్గొండ లోని ఓ ఎగ్జామ్ హాల్లో సినీ నటి హేమను చూసి….ఆ పరీక్ష రాయడానికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు.! మొదట షూటింగ్ లో భాగమేమో అనుకొన్న వారంతా….నిజంగా హేమ కూడా పరీక్ష రాయడానికి వచ్చారని తెలిసి ఆశ్చర్యపోయారు.!
53 ఏళ్ల వయస్సులో…ఈ పరీక్ష ఎందుకు?
హేమ 7వ తరగతి వరకు మాత్రమే చదివారు. తర్వాత సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడంతో బిజీబిజీ అయిపోయారు. కానీ ఆమెకు మాత్రం చదవాలనే కోరిక బలంగా ఉండేది…అందుకే ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయడం కోసం….ఆర్హత పరీక్ష రాయడానికి నల్గొండ వెళ్లారు.! ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ చదవడానికి అర్హత లభిస్తుంది! గత రెండు సంవత్సరాలుగా ఈ అర్హత పరీక్ష రాయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ సమయం కుదరక రాయలేదట…ఈ సారి మాత్రం ఎలాగైనా రాయాలనే ఉద్దేశంతో పరీక్షకు అటెండ్ అవ్వడమే కాకుండా ఎగ్జామ్ కూడా చాలా బాగా రాశారట!రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్న కొండాపురం సినిమాలో నటిస్తున్న హేమ …. దగ్గరగా ఉంటుందన్న కారణంతో నల్గొండ సెంటర్ ను ఎంచుకున్నారట!
Advertisement
Advertisements
Advertisements