Advertisement
డేట్లు కుదరక కొన్ని, కథ నచ్చక కొన్ని…..ఇలా కొంతమంది హీరోలు వదులుకున్న సినిమాలు వేరే హీరోల చేతల్లోకి వెళ్లి బ్లాక్ బస్టర్లుగా నిలిచిపోయాయి.! ఇలా తెలుగులో కూడా అనేక సినిమాలున్నాయి. కొంతమంది దర్శకులైతే కథ రాసేటప్పుడే ఫలానా హీరో అని ఫిక్స్ అయిపోతారు…కానీ ఆ హీరో నో అని చెప్పేసరికే వేరే వాళ్లతో లాగించే ప్రయత్నం చేస్తారు. అలా తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీస్ ను వదులుకున్న హీరోస్ , వాళ్లు వదులుకున్న ఆ సినిమాలేంటో చూద్దాం!
అర్జున్ రెడ్డి :
శివ సినిమా తర్వాత ఇండస్ట్రీలో అంతటి ట్రెండ్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి . ఎన్నో వివాదాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఈ కథని మొదట డైరెక్టర్ సందీప్ రెడ్డి హీరో అల్లు అర్జున్ కి చెప్పడానికి ప్రయత్నించాడు . అది కుదరకపోవడంతో తర్వాత శర్వానంద్ కి చెప్పాడు. అతనికి కథ నచ్చిన తన ఇమేజ్ కి సరిపోదని రిజెక్ట్ చేసాడు . ఈ సినిమాతో విజయ్ దేవరకొండ దశ-దిశ తిరిగింది.
Advertisements
సింహాద్రి:
జూనియర్ ఎన్టీఆర్ కి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా సింహాద్రి . అయితే ఈ సినిమా రచయిత మరియు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ కథని బాలకృష్ణ కోసం రాసాడంట . కాని అది కుదరకపోవడంతో రాజమౌళి తారక్ ను అప్రోచ్ అవ్వడానికి ప్రాజెక్ట్ ఓకే అయ్యింది…బొమ్మ దద్దరిల్లింది!
ఠాగూర్:
చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా మొదట హీరో రాజశేఖర్ చేయాల్సింది . కానీ చివరి నిమిషంలో చిరు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అందుకే చిరుకు రాజశేఖర్ కు మద్య గొడవలు అయ్యాయి అంటారు.! ఏది ఏమైనా ఠాగూర్ ఓ బ్లాక్ బస్టర్.
ఇడియట్ :
మాస్ మహారాజ రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి మూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సూపర్ హిట్ సినిమా ఇడియట్ ! ఈ కథని ముందుగా పూరి పవన్ కళ్యాణ్ కి వినిపించాడు కానీ పవన్ డేట్స్ కుదరక రవితేజ తో చేశాడు. ఈ విషయంలో పవన్ చాలా దురదృష్టవంతుడు…. రవితేజ చేసిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి , మిరపకాయ్ సినిమాలు కూడా పవన్ వదులుకున్నవే!
తొలిప్రేమ:
Advertisement
పవన్ కళ్యాణ్ కెరీయర్లో సూపర్ హిట్ సినిమా తొలిప్రేమ మొదట్లో డైరెక్టర్ కరుణాకర్ ఈ కథ ని సుమంత్ కి చెప్పారు . కానీ అతను రిజెక్ట్ చేయడంతో పవన్ ఆ సినిమా చేసాడు . అది అప్పట్లో యూత్ ఫెవరేట్ మూవీ గా నిలిచింది.
చంటి:
విక్టరీ వెంకటేష్ కి మంచి పేరు , అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమా చంటి. ఇది తమిళ్ సినిమా , దీనిని మొదట రాజేంద్రప్రసాద్ రీమేక్ చేయాలి అనుకున్నారు , కానీ వెంకటేష్ చేసాడు .
దిల్ , ఆర్య , ఎవడు :
వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన దిల్ , సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య , ఎవడు సినిమాలు మొదట జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సినవి కానీ కాల్షీట్లు కుదరక , దిల్ నితిన్ తో , ఆర్య అల్లు అర్జున్ తో , ఎవడు రాంచరణ్ తో చేసి సూపర్ హిట్ లు కొట్టారు . అల్లు అర్జున్ హీరోగా నటించిన మరో సినిమా నా పేరు సూర్య కథని కూడా వక్కంతం వంశీ జూనియర్ ఎన్టీఆర్ కోసమే రాసుకున్నాడంట , తర్వాత బన్నితో చేసాడు.
బాహుబలి:
తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చూపించిన సినిమా బాహుబలి . ఈ సినిమాని మొదట రాజమౌళి బాలీవుడ్ హీరోలతో చేయాలనుకున్నాడు వారి ద్వారా మార్కెట్ సులువవుతుందనుకున్నాడు. కానీ తర్వాత ప్రభాస్ తో చేసి ఇండియన్ సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టాడు . ప్రభాస్ పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు.
కొత్త బంగారులోకం :
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమా కథను మొదటగా నాగచైతన్యకు వినిపించారు , చైతూ ఒప్పుకోకపోవడంతో వరుణ్ తో చేసి హిట్ కొట్టారు.
శతమానం భవతి :
దిల్ రాజు నిర్మాతగా శర్వానంద్ హీరోగా చేసిన సూపర్ హిట్ ఫ్యామిలీ సినిమా శతమానం భవతి . ఈ సినిమా రాజ్ తరుణ్ చేయాల్సింది . కానీ దిల్ రాజుతో ఉన్న గొడవల కారణంగా అతనిని తప్పించి , శర్వానంద్ తో చేశారని ఓ టాక్!
Advertisements