Advertisement
సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు చాలా కామన్.! హీరోలు, హీరోయిన్స్ మధ్య ఉండే ఈ లవ్ స్టోరీలు అనేకం పెళ్లి దాకా వెళ్లాయి.అలాగే డైరెక్టర్స్ మరియు హీరోయిన్స్ మద్య కూడా కొన్ని లవ్ స్టోరీలు పెళ్లిదాకా వెళ్లాయి. అలా డైరెక్టర్స్ తో లవ్ మ్యారేజ్ లు చేసుకున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
1. సుహాసిని:
సుహాసిని… సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాలంలో డైరెక్టర్ మణిరత్నం ను లవ్ చేసి అతడినే పెళ్ళిచేసుకున్నారు . ఈమె సౌత్ లోని అన్ని భాషల్లో కలిపి 300 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది . ఒక్క తెలుగులోనే 60 కి పైగా సినిమాలు చేసింది. 1981 లోనే డైరెక్టర్ మణి రత్నంని పెళ్లి చేసుకున్నాక కూడా చాలా సంవత్సరాలు హీరోయిన్ గా తన కెరియర్ కొనసాగించింది .
ప్రస్తుతం: క‌్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
Advertisements
2. రోజా:
2002లో రోజా తమిళ్ డైరెక్టర్ సెల్వమనిని పెళ్లిచేసుకున్నారు. వీరిది లవ్ మ్యారేజ్. తెలుగు , తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే వీరి మ్యారేజ్ అయిపోయింది. సెల్వవని డైరెక్టర్ గా 15 సినిమాలు చేయగా అందులో 11 సినిమాల్లో రోజా నటించింది .
ప్రస్తుతం: MLAగా, జబర్థస్త్ జడ్జ్ గా బిజీబిజీగా ఉన్నారు.
3. రమ్యకృష్ణ:
100 పైగా తెలుగు సినిమాల్లో నటించిన రమ్యకృష్ణకు నటిగా మంచి పేరు తెచ్చిన సినిమా చంద్రలేఖ…. ఆ సినిమా డైరెక్టర్ కృష్ణవంశీనే 2003 లో పెళ్ళిచేసుకున్నారు. వీరిది లవ్ మ్యారేజే!
ప్రస్తుతం : క‌్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.
4. రాధిక:
ఎన్నో తెలుగు,తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధిక కూడా తమిళ్ డైరెక్టర్ అయిన ప్రతాప్ పోతేని ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.కానీ పెళ్ళైన మూడేళ్లకే మనస్పర్ధల కారణంగా విడిపోయారు . తర్వాత రాధిక ఆయనకు విడాకులు ఇచ్చి , లండన్ కి చెందిన రిచర్డ్ హార్లీని పెళ్లి చేసుకుంది . ఇక ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు . అనంతరం హీరో శరత్ కుమార్ తో ప్రేమలో పడి 2001లో అతడిని మూడో వివాహం చేసుకుంది.
Advertisement
5.ఖుష్బూ:
ఖుష్బూ కూడా తమిళ్ డైరెక్టర్ సుందర్ ని ప్రేమించి 1997 లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.
6. సోనియా అగర్వాల్:
7G బృందావన్ కాలనీ సినిమాతో తెలుగు, తమిళ్ భాషల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనియా అగర్వాల్ అదే సినిమా డైరెక్టర్ , తమిళ్ హీరో ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ ని పెళ్లి చేసుకుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు .
7. అమలాపాల్:
తెలుగు ,తమిళ్ భాషల్లో చాలా సినిమాలు చేసిన అమలాపాల్ కూడా తమిళ్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి 2014 లో వివాహం చేసుకుంది. కానీ కొన్ని కారణంగా రీత్యా వీరు 2017 లో విడిపోయారు.
8. కల్యాణి:
అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా హీరోయిన్ కల్యాణి కూడా డైరెక్టర్ సూర్యకిరణ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. కళ్యాణి సూర్య కిరణ్ డైరెక్షన్లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది . సూర్య కిరణ్ తెలుగులో రాజా భాయ్ , సత్యం లాంటి సినిమాలను డైరెక్ట్ చేసాడు .బిగ్ బాస్ 4 లో కూడా పార్టిసిపేట్ చేశాడు.
9. శరణ్య:
శరణ్య మొదట నటుడు సంపత్ దాస్ ని పెళ్లిచేసుకుంది. మనస్పర్థల కారణంగా అతనితో విడిపోయి…. తర్వాత తమిళ్ డైరెక్టర్ పొవణ్ణం ని ప్రేమ వివాహం చేసుకుంది.
10 . రేవతి
రేవతి కూడా మలయాళం డైరెక్టర్ అయిన సురేష్ మీనన్ ని 1986 లో ప్రేమించి వివాహం చేసుకుంది. తర్వాత 2014 లో వీరు విడిపోయారు.
Advertisements