Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

విల‌న్లుగా నటించిన… కొందరు హీరోయ‌న్స్!

Advertisement

సినిమా అంటే హీరో,హీరోయిన్,కమెడియన్,విలన్ ఇలా ఎన్నో పాత్రల సమ్మేళనం…హీరోయిన్స్ అంటేనే అందం..అటువంటి అందెగత్తెలు విలన్స్ అవతారం ఎత్తితే ఎలా ఉంటుంది.. సినిమాల్లో నెగటివ్ రోల్స్ పోషించిన కొందరు హీరోయిన్స్ గురించి చెప్పుకుందాం..

రమ్యకృష్ణ

సినిమాల్లో నెగటివ్ రోల్ పోషించిన హీరోయిన్స్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ.. నరసింహా సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. సూపర్ స్టార్ రజనికాంత్ తో పోటాపోటిగా నటించి అందరిని మెప్పించింది.

శ్రేయారెడ్డి

Advertisements

నేను మీసం లేని మగరాయున్ని రా..పొగరు సినిమాలో శ్రేయరెడ్డి పలికే ఈ డైలాగ్ సినిమాకే హైలైట్..యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రేయారెడ్డి రెండు మూడు సినిమాల్లో నటించి తర్వాత విశాల్ అన్నని పెళ్లిచేసుకుని సెటిల్ అయిపోయింది.పొగరులో పాత్ర శ్రేయారెడ్డికి బాగా పేరు తీసుకొచ్చింది.

పాయల్ రాజ్ పుత్

తొలి సినిమాతోనే నెగటివ్ రోల్ తో మెప్పించింది పాయల్ రాజ్ పుత్..  దర్శకుడు చాలా పకడ్బందిగా తెరకెక్కించిన సినిమా Rx100. ఫస్ట్ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసి గుర్తింపు తెచ్చుకుంది.

రాశి

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రాశి తర్వాత నెగటివ్ రోల్స్, ఐటమ్ సాంగ్స్లో నటించింది..నిజం చిత్రంలో గోపిచంద్ సరసన విలనిరోల్ గా నటించింది.

నికిత

Advertisement

హాయ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన నికిత కొన్ని సినిమాల్లో నటించి తెలుగు పరిశ్రమకి దూరం అయింది.. చాలా ఏళ్లకి నాగార్జున డాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో మెరిసింది..చివరికి తెలిసేది ఏంటంటే నికిత ది నెగటివ్ రోల్.. హీరోయిన్గా మార్కులు పడకపోయినా ఈ సినిమాలో నికిత క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగానే నచ్చింది.

త్రిష

పొలిటికల్ థ్రిల్లర్ ధర్మయోగి సినిమాలో త్రిష నెగటివ్ రోల్ లో మెప్పించింది.. రాజకీయంలో పదవి కంటే ఏది ముఖ్యం కాదనుకునే పాత్రలో,పదవి కోసం ఎంతకైనా తెగించే పాత్రలో ఒదిగిపోయింది.

రీమాసేన్

యుగానికొక్కడు, వల్లభ సినిమాల్లో నెగటివ్ రోల్ పోషించింది రీమాసేన్..అందంతోనే కాదు, విలనిజంతోనూ మెప్పించనని నిరూపించుకుంది.

సౌందర్య

“నా మనసిస్తా రా”  సినిమాలో నెగటివ్ రోల్ లో నటించింది సౌందర్య.. సౌందర్యని నెగటివ్ రోల్ లో ఊహించుకోవడం చాలా కష్టం…అందుకే ఆ పాత్రని తను యాక్సెప్ట్ చేసి నటించినప్పటికి జనం యాక్సెప్ట్ చేయలేదు..

సమంతా

క్యూట్ ..స్వీట్ బ్యూటి సమంతా కూడా విలనీ రోల్ పోషించింది.. విక్రమ్ నటించిన టెన్ సినిమాలో సమంతది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర..

భానుప్రియ

గూఢచారి 117 సినిమాలో  నెగటివ్ రోల్ లో నటించింది భానుప్రియ..కానీ జనాలకు పెద్దగా నచ్చలేదు..దాంతో మళ్లీ ఎప్పుడు అటువంటి పాత్రల జోలికిపోలేదు.

Advertisements