Advertisement
సినిమా ఓ రంగుల ప్రపంచం. రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతే రంగస్థలం! ఇక్కడి నుండే తబ కెరీర్ ను, పర్సనల్ లైఫ్ ను బిల్డ్ చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు. షూటింగ్ లో తమ సహ నటులను, డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకొని సక్సెస్ ఫుల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్న వారు ఉన్నారు. ప్రేమను మద్యలోనే బ్రేకప్ చెప్పిన వాళ్లు ఉన్నారు. ఇప్పుడు షూటింగ్ సమయంలో లవ్ లో పడి, మద్యలో బ్రేకప్ చెప్పిన హీరోయిన్స్ గురించి చూద్దాం!
1.నయనతార:
వల్లవన్ షూటింగ్ సమయంలో శింబుతో రిలేషన్ షిప్ లో ఉన్న నయనతార తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత ‘విల్లు’ షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో రిలేషన్ షిప్ లో ఉంది. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించారు.కానీ పెళ్లి పీటల మీదకు ఎక్కక ముందే తాము విడిపోతున్నట్టు ప్రకటించింది నయన్ !
2.అమలా పాల్:
Advertisements
దైవ తిరుమగల్ అనే సినిమా సమయంలో డైరెక్టర్ AL విజయ్ తో లవ్ లో పడ్డ అమలాపాల్ 2004లో అతడినే పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని మనస్పర్థల కారణంగా 2017 లో విడాకులు తీసుకుంది. ఈ విడాకులకు ధనుష్ కారణమంటూ విజయ్ తండ్రి అప్పట్లో సంచలన ప్రకటనలు కూడా చేశాడు.
3.రష్మిక మందన్న:
కిరిక్ పార్టీ సమయంలో తన సహ నటుడైన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డ రశ్మిక మదన్న.. 2017 లో అతడితో నిశ్చితార్థం చేసుకుంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2018 లో ఇరువురు తమ నిశ్చితార్థాన్ని కాన్సిల్ చేసుకున్నారు.
Advertisement
6. శృతిహాసన్
శృతిహాసన్ హాలీవుడ్ వెబ్ సీరిస్ చేస్తున్న సమయంలో తన సహ నటుడైన మైఖెల్ కోర్సెల్ తో ప్రేమలో పడ్డారు. ఈ రిలేషన్ షిప్ కొన్నాళ్లు బాగానే సాగింది. కానీ ఏందుకో అనూహ్యంగా తమ రిలేషన్ షిప్ ను బ్రేకప్ చేస్తున్నట్టుగా ప్రకటించింది ఈ జంట!
5.అంజలి:
జర్నీ సినిమా సమయంలో ….హీరోయిన్ అంజలి తన సహ నటుడు జై తో లవ్ లో పడ్డట్టు అనేక రూమర్స్ వచ్చాయి. ఈ పుకార్లు నిజం అనేలా వారు కూడా తర్వాత అనేక సార్లు కలిసి కనిపించారు.
6.ఆండ్రియా:
ప్లే బ్యాక్ సింగర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆండ్రియా….మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో రిలేషన్ షిప్ లో స్టార్ట్ చేశారు . అప్పట్లో ఈ జంటపై ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి. దానికి కారణం అనిరుద్ వయస్సు 22 , ఆండ్రియా వయస్సు 27 సంవత్సరాలు ఉండడం.! అనిరుద్ తో బ్రేకప్ తర్వాత ఆండ్రియా నటిగా మంచి సినిమాలు చేసుకుంటూ కెరీర్ పై దృష్టి సారించారు.
Advertisements