Advertisement
వేదాలు చెబుతున్న ప్రకారం మన దేహంలో మొత్తం 7 కంటికి కనిపించని చక్రాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అవి దేహంలో వివిధ భాగాల్లో ఉంటాయి. అయితే వీటిలో వెన్నుకు ఛాతికి మధ్యలో ఉండే చక్రం.. అనహత చక్రం.. ఇది 7 చక్రాల్లో 4వది. అనహత అంటే.. దెబ్బతగలనిది.. కొట్టలేనిది.. దాడికి గురికానిది.. అనే అర్థాలు వస్తాయి. అలాగే ఈ చక్రం ప్రశాంతతకు చిహ్నంగా ఉంది. ఇది ప్రేమ, సానుభూతి, నిస్వార్థం, భక్తిలను కూడా సూచిస్తుంది. ఈ చక్రం మధ్యభాగం మనుషులను ప్రేమించమని, ప్రేమగా ఉండాలని, ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండాలని, ఇతరులపై జాలి, దయ చూపాలనే విషయాలను తెలియజేస్తుంది.
అయితే ఈ చక్రం మధ్యభాగంలో రెండు త్రిభుజాలు కలిసి ఒక షట్కోణాన్ని ఏర్పాటు చేసి కనిపిస్తాయి. షట్కోణం అంటే ఆరు కోణాలు కలది అని అర్థం. అంటే ఇంగ్లిష్‌లో హెగ్జాగ్రాం అని పిలుస్తారు. ఇందులో 6 కోణాలు ఉంటాయి. దీన్ని స్త్రీ, పురుషుల కలయికకు ప్రతిరూపమని భావిస్తారు. శివుడు, పార్వతిల స్వరూపాలుగా చెబుతారు.
Advertisement
ఇక అనహత చక్రంలోని షట్కోణం యూదులకు చెందిన స్టార్ ఆఫ్ డేవిడ్ చక్రాన్ని పోలి ఉంటుంది. దీన్ని జుడాయిజంలో ఆధ్యాత్మిక చిహ్నంగా వాడుతారు. 19వ శతాబ్దం నుంచి క్రిస్టియానిటీలో దీన్ని ఆధ్యాత్మిక చిహ్నంగా వాడడం మొదలు పెట్టారు. కానీ అంతకు ముందు వరకు ఈ చిహ్నం కేవలం ఒక ఆభరణం, అలంకరణ గుర్తుగా మాత్రమే ఉండేది. ఇక స్టార్ ఆఫ్ డేవిడ్ చిహ్నాన్ని క్రీస్తు శకం 3, 4 శతాబ్దాలకు చెందిన ఓ రాయిపై చూడవచ్చు. గతంలో ఆ రాయి గెలిలీ అనే ప్రాంతంలో బయటపడింది. 11వ శతాబ్దంలో ఇజ్రాయెల్ వాసులు ఆ చిహ్నాన్ని షీల్డ్ ఆఫ్ డేవిడ్‌గా వ్యవహరించేవారు. దాన్ని దైవంగా కొలిచేవారు.
Advertisements
అయితే క్రీస్తుశకం 3వ శతాబ్దంలో దక్షిణ ఇటలీలోని టరంటోలో ఉన్న అపులియా అనే ప్రాంతంలో యూదులకు చెందిన ఓ సమాధి రాయిపై కూడా ఈ చిహ్నం ఉన్నట్లు గుర్తించారు. 1897లో ఇజ్రాయెల్‌లో మొదటి జియోనిస్ట్ కాంగ్రెస్ సింబల్‌గా షట్కోణాన్ని ఉపయోగించారు. తరువాత దాన్ని ఇజ్రాయెల్ జాతీయ పతాకంలోనూ వాడడం మొదలు పెట్టారు.
ఇక భారతీయులు షట్కోణాన్ని అనేక రకాలుగా ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. నిత్యం మహిళలు వేసే రంగవల్లికల్లో మనం షట్కోణాన్ని చూడవచ్చు. అలాగే వేదిక్ యంత్రాల్లోనూ దీన్ని వాడుతున్నారు. శ్రీ యంత్రం (చక్రం)లో అనేక రకాల షట్కోణాలను మనం చూడవచ్చు. అలాగే శివుడు నటరాజు రూపంలో నృత్యం చేసే బొమ్మ కూడా షట్కోణాన్ని సూచిస్తుంది. ఇలా అనహత చక్రంలోని షట్కోణం ప్రసిద్ధి గాంచింది.
Advertisements