Advertisement
IPL అంటేనే బౌండరీల మోత, పరుగుల వరద.! హార్డ్ హిట్టింగ్ లు, 200+ ను మించిన స్ట్రైక్ రేట్లు…ఇవన్నీ కామన్ థింగ్స్! అయితే ఇప్పటి వరకు జరిగిన అన్నీ IPL ల్స్ లో…ఏ టీమ్ నుండి ఎక్కువగా సెంచరీలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం! (నోట్…కొంత మంది ప్లేయర్స్ తర్వాత టీమ్ మారారు…కానీ వారు ఏ టీమ్ కు ఆడినప్పుడు చేసిన సెంచరీలను ఆ టీమ్ ఖాతాలోనే వేయడం జరిగింది)
KKR
ఐపిఎల్ లో రెండు సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన ఈ టీమ్ ఇప్పటివరకు కేవలం ఒకే సెంచరీ నమోదు చేసింది . అది కూడా ఐపీఎల్ మొట్టమొదటి మ్యాచ్ లో బ్రెండెడ్ మెక్కల్లమ్ చేసిన 158 రన్స్… IPL కు మెక్కల్లమ్ ఇన్నింగ్స్ మంచి ఓపెనింగ్ ను ఇచ్చిందనే చెప్పాలి!
Advertisements
SRH ( సన్ రైజర్స్ హైదరాబాద్)
2016లో ఫస్ట్ టైమ్ ఛాంపియన్స్ నిలిచిన SRH నుండి ఇప్పటి వరకు 3 సెంచరీలు నమోదయ్యాయి! ఇందులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక్కడే రెండు సెంచరీలు సాధించగా , ఈ సీజన్ లో జానీ బెయిర్ స్టో ఒక సెంచరీని సాధించాడు.!
MI ( ముంబై ఇండియన్స్ )
నాలుగు సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన ఈ టీమ్ నుండి ఇప్పటివరకు 4 సెంచరీలు నమోదయ్యాయి! జయసూర్య, సచిన్, రోహిత్ శర్మ, లెండిన్ సిమెన్స్ లు తలా ఒక్క సెంచరీ చేశారు.
RR ( రాజస్థాన్ రాయల్స్ )
ఐపీఎల్ మొదటి సీజన్లో అండర్ డాగ్ గా బరిలోకి దిగి ఏకంగా ట్రోపి గెలిచిన ఈ టీమ్ నుండి 6 సెంచరీలు నమోదయ్యాయి! ఇందులో అజ్యింక రెహాన్, వాట్సాన్ లో చెరో రెండు సెంచరీలు చేయగా….. యూసుఫ్ పఠాన్ , సంజూ శ్యాంసన్ లు ఒక్కో సెంచరీ చేశారు .
Advertisement
DC ( ఢిల్లీ క్యాపిటల్స్ )
ఈ సీజన్ లో ఫైనలిస్ట్ అయిన DC నుండి 10 సెంచరీలు నమోదయ్యాయి. అందులో వార్నర్ 2 సెంచరీలు, శిఖర్ 2 సెంచరీలు చేయగా…డివిలీయర్స్, సెహ్వాగ్ , పీటర్సన్ , డికాక్, సంజూ శాంసన్ , రిషబ్ పంత్ లు ఒక్కో సెంచరీ చేశారు.!
CSK ( చెన్నై సూపర్ కింగ్స్ )
ఈ సీజన్ మినహాయించి….ప్రతి సీజన్ లో ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయిన ఈ టీమ్ నుండి 8 సెంచరీలు నమోదయ్యాయి.! మురళి విజయ్ షేన్ వాట్సన్ చెరో రెండు సెంచరీలు సాధించగా…. సురేష్ రైనా , మైక్ హస్సి, మెక్కల్లమ్, అంబటి రాయుడు లు ఒక్కో సెంచరీ సాధించారు .
KXIP ( కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
ఈ టీమ్ ఇప్పటి వరకు 11 సెంచరీలు నమోదు చేసింది. అందులో హాషీం ఆమ్లా రెండు సెంచరీలు చేశాడు.
RCB ( రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు )
ఐపీఎల్ లో RCB టీమ్ 13 సెంచరీలు చేసి టాప్ ప్లేసులో నిలిచింది. ఈ 13 సెంచరీలలో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే 10 సెంచరీలు సాధించారు..వారు విరాట్ కోహ్లీ మరియు క్రిస్ గేల్. వీరిద్దరూ చెరో 5 సెంచరీలు చేసి రికార్డ్ నెలకొల్పారు.
Advertisements