Advertisement
హిందూ సాంప్రదాయంలో ఒక్కో దేవుడు, దేవతను పూజించేందుకు ఒక్కో విధానం ఉంటుంది. అలాగే వారికి భిన్న రకాల నైవేద్యాలను భక్తులు సమర్పిస్తుంటారు. ఇక వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడు, దేవతకు ప్రీతికరం కనుక ఆయా రోజుల్లో వారిని భక్తులు పూజిస్తుంటారు. అయితే దేవుళ్లు, దేవతలకు భిన్న రకాల వాహనాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సృష్టికి కారకుడైన బ్రహ్మ దేవుడు హంసపై విహరిస్తాడు. హంస ఆయన వాహనం.
బ్రహ్మ దేవుడి భార్య సరస్వతి వాహనం కూడా హంసే. దానిపై ఆమె ప్రయాణిస్తుంది.
Advertisements
స్థితి కారకుడు విష్ణువు గరుడ పక్షిపై ప్రయాణిస్తాడు. ఆ పక్షి దైవాంశ సంభూతమైంది.
లక్ష్మీదేవి తామరాకులపై కూర్చుంటుంది. ఆమె వాహనం గుడ్లగూబ.
లయ కారకుడు శివుడు నందిపై ప్రయాణిస్తాడు. నంది అంటే ఎద్దు.
పార్వతీ దేవి వాహనం పులి. అనేక చిత్రాల్లో ఆమె పులిపై ఉండడాన్ని మనం గమనించవచ్చు.
Advertisement
వినాయకుడి వాహనం ఎలుక. దానిపై ఆయన ప్రయాణిస్తాడు.
కుమారస్వామి వాహనం నెమలి.
మొసలి వరుణ దేవుడి వాహనం.
సూర్య దేవుని వాహనం గుర్రం.
చంద్రుని వాహనం జింక.
ఇంద్రుడి వాహనం ఐరావతం. అంటే తెల్ల ఏనుగు.
అగ్ని దేవుడి వాహనం మేక. మేకపై ప్రయాణిస్తాడు.
యముడి వాహనం దున్నపోతు. దానిపై ఆయన ప్రయాణం చేస్తాడు.
శని దేవుడి వాహనం కాకి.
Advertisements
ఇక వాయు దేవుడి వాహనం కూడా గుర్రం కాగా భైరవుడి వాహనం కుక్క. కుబేరుడి వాహనం చిలుక లేదా గుర్రం.