Advertisement
ఒక సినిమా మంచి విజయం సాధించిన వెంటనే చాలా మంది సోషల్ మీడియాలో గాని ఎలక్ట్రానిక్ మీడియాలో గాని మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. బాక్సాఫీస్ తాట తీసాడు, బాక్సాఫీస్ అమ్మ మొగుడు, బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు అని… అసలు బాక్సాఫీస్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అసలు బాక్సాఫీస్ అంటే ఏంటో చూద్దామా…?
వాస్తవానికి ‘బాక్స్ ఆఫీస్’ అనేది ఒక మాట కాదు. కానీ మనం రాసినా చదివినా బాక్సాఫీస్ అని రాస్తాం, చదువుతాం. ‘బాక్స్ – ఆఫీస్’ అనేవి రెండు. దీని చరిత్ర ఏంటి అంటే… పదహారో శతాబ్దంలో యూరోపియన్ దేశాలలో నాటకాలు ఆడే థియేటర్లలో సమాన్య ప్రజలకి ముందు హై క్లాస్ వాళ్ళు కూర్చుని చూడటానికి వెనుక సీట్లు ఏర్పాటు చేసే వారు.
Advertisement
Advertisements
ప్రముఖులు కూర్చోవడానికి గానూ… అట్ట పెట్టెలాంటి ఒక చోటు ఉంటుంది. దానిని బాక్స్ అని పిలిచే వాళ్ళు. వాటిని పలు క్లాసులుగా మార్చి ఒక్కో రేటు పెడతారు. ఏదైనా ఒక నాటకానికి ఆ ‘బాక్సు’ నిండితే అది సూపర్ హిట్ అన్నట్టు. ఆ బాక్స్ లో కూర్చునే వాళ్ళు చాలా ఖరీదైన టికెట్ కొనాల్సి ఉంటుంది. థియేటర్ కు ఆనుకుని ఉండే ఆఫీస్ లో టికెట్ కొంటారు. ఆ విధంగా ఆఫీసులో టికెట్ లు అన్నీ అమ్ముడు అయిపోయిన తర్వాత లెక్కించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అని లెక్క పెడతారు. అదే బాక్సాఫీస్ కలెక్షన్ అన్నట్టు. ఆ కలెక్షన్ బాగుంటే నాటకం సూపర్ హిట్. అవే ఇప్పుడు నేల టికెట్, ఫస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్, బాల్కనీ. ఇక టికెట్ లు అన్నీ అమ్మేసిన తర్వాత ఫుల్ హౌస్ అని బోర్డు పెడతారు. మనం హౌస్ ఫుల్ చేసాం.
Advertisements